ఆర్సీబీ విక్టరీపై బన్నీ ఇంట్లో సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ బాయ్ మూమెంట్ !
ఎట్టకేలకు ఐపీఎల్ 18వ సీజన్‌లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కప్ కొట్టింది. చిరకాలంగా ఎదురుచూసిన ఆ కల చివరకు నెరవేరింది. ఆర్సీబీ అభిమానుల ఆశలు నిజం అయ్యాయి. ఈ సాలా కప్ నమ్దే అనే నినాదం, ఇప్పటివరకు మీమ్‌లుగా మారిపోయినా... ఈసారి అది నిజమైన విజయగాథగా మారింది. ఆర్సీబీ ట్రోఫీని గెలుచుకోవడంతో.. ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. .
టాలీవుడ్ తారల హంగామా..
బెంగుళూరు టీం కప్ గెలవడంతో అల్లు అర్జున్ ఇంట్లో అయితే నిజంగా పెద్ద సెలబ్రేషన్ జరిగినట్టు కనబడుతోంది. ఆయన కొడుకు అయాన్ ఎమోషన్‌లో నేలపై పడుకుని దండం పెట్టాడు. నీళ్లు తలపై పోసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కంటతడి పెట్టడం కూడా గమనించవచ్చు. ఈ సీన్ అంతటినీ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. "సో క్యూట్ మై చిన్ని బాబు" అంటూ ఆ పోస్టుకి క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ గా మారింది.

పలువురు ప్రముఖుల ట్వీట్స్..
విజయ్ దేవరకొండ.. పెద్దగా మాట్లాడకుండా తల నిమిరించి నిలబడిన ఆ ఫైటింగ్ స్పిరిట్ అదుర్స్. ఆర్సీబీ యో డన్ ఇట్!" అంటూ ట్వీట్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ కూడా భావోద్వేగంతో స్పందిస్తూ - "ఎన్నో ఓటములు, ఎన్నో ట్రోల్స్, ఎన్నో నిందలు.. కానీ చివరికి చరిత్ర రాసిన టీం ఇది. పోరాటానికి పరమావధి.. ఫైనలీ, ఈ సాలా కప్ నమ్దే!!" అని ట్వీట్ చేశాడు.
తమన్ తన స్టూడియోలో మ్యూజిక్ బీట్‌లకు ఆర్సీబీ విజయం ఫీలింగ్‌ను మార్చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేశాడు.
రానా దగ్గుబాటి, "పవర్, పర్సిస్టెన్స్, ప్యాషన్ - That's RCB! You did it, champs!" అంటూ స్టోరీల ద్వారా అభినందనలు తెలిపాడు.
సమంత, "విరాట్‌కి deserved win.. goosebumps moment!" అంటూ హార్ట్ ఎమోజీలతో స్టోరీ పోస్టు చేసింది.
నితిన్, విష్ణు మంచు, లావణ్య త్రిపాఠి, అఖిల్, ఇలా ఎందరో టాలీవుడ్ ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా వేదికలపై RCB టీంకు శుభాకాంక్షలు తెలిపారు.
బాలీవుడ్‌లో కూడా ఉత్సాహం..
ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. ఆమె విరాట్ ని హత్తుకొని ఏడ్చే వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలానే రణవీర్ సింగ్, ఆలియా భట్, కార్తిక్ ఆర్యన్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ట్రోఫీ గెలిచిన ఆర్సీబీకి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications