అది పూర్తిగా తప్పు: నిహారిక విడాకులపై చైతన్య
కొణిదెల నిహారిక తన విడాకుల గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హోస్ట్ విడాకులు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించగా.. ఆ బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని, విడాకులకు ముందు, తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను వివరంగా ప్రస్తావించారు. ఆమెను ప్రశ్నించిన హోస్ట్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వెంటనే నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య స్పందించారు. వాస్తవం తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడటం చాలా తప్పని, రెండువైపులా ఆలోచించాలంటూ సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టారు.
ఇటీవల నిహారిక ఎదుర్కొన్న నెగటివిటీని దూరం చేసే ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని చైతన్య అన్నారు. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం తేలిక కాదని, కానీ బాధితులను ట్యాగ్ చేయడంతోపాటు ఆ తరహా వేదికలను ఉపయోగించడం మానుకోవాలని సూచించారు. ఇలా జరగడం రెండోసారన్నారు. విడాకులకు సంబంధించిన విషయాల్లో ఇద్దరికీ బాధ ఉంటుందని, ఎప్పుడూ ఒకవైపే మాట్లాడకూడదని చైతన్య హితవు పలికారు.

బాధ నుంచి ఎలా కోలుకున్నామనే విషయంపై మాట్లాడితే ప్రజలకు ఉపయోగముంటుందని, భవిష్యత్తులో ఈ తరహా ప్రయత్నం చేస్తే సంఘటనతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం కూడా అంతే తప్పన్నారు.
నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గతేడాది విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి విడాకుల వ్యవహారం తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే తొలిసారిగా ఆమె విడాకుల విషయానికి సంబంధించి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో తానుపడ్డ బాధను, ఎన్నిసార్లు ఏడ్చాను.. ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications