పవన్ కళ్యాణ్ సినిమాలో నటించనున్న చంద్రబాబు కోడలు..?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం తాను క‌మిటైన సినిమాలు పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 12న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్ స్పీడ్ కూడా పెంచారు. ఈ క్రమంలోనే ఓజీ సెట్‌లో కూడా పవన్ అడుగుపెట్టారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కు కూడా గుమ్మడి కాయ కొట్టేయ‌నున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండ‌గా.. ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా చేస్తోంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ సహా పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ మూవీ రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

chandrababus-daughter-in-law-to-act-in-pawan-kalyans-og-movie

అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ వార్త సోషల్ మీడియాని ఓ ఊపు ఉపేస్తుంది. భారీ హైప్ తో రాబోతున్న ఈ చిత్రంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలు కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ విషయంపై హాట్ బజ్ మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా.. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు పవన్ చిత్రంలో చంద్రబాబు కుటుంబ సభ్యురాలు నటించనున్నట్టు వార్తలు రావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన నారా వారి కోడలు..

అయితే పవన్ ఓజీ సినిమాలో నటించనుంది.. చంద్రబాబు నాయుడు తమ్ముడికి కాబోయే కోడలు నటి సిరి లేళ్ల అని అంటున్నారు. ముందుగా చంద్రబాబు కోడలు అంటే బాలకృష్ణ కుమార్తె, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అని అంతా అనుకున్నారు. కానీ చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి చేసుకోబోయే సిరి అని క్లారిటీ ఇస్తున్నారు. తమ్ముడు కొడుకు కావడంతో రోహిత్ కూడా.. చంద్రబాబుకు కుమారుడి వరుస అవుతారు దాంతో సిరి నారా వారి కుటుంబంలోకి కోడలు కాబోతుంది అని వివరిస్తున్నారు.

కాగా సిరి గ‌తంలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమ‌గా మారి.. రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఇటీవ‌ల నారా రోహిత్ తండ్రి మరణించడంతో ఈ పెళ్లి వాయిదా పడింది. ప్రస్తుతం సిరి ఓజీ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేయ‌నుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

chandrababus-daughter-in-law-to-act-in-pawan-kalyans-og-movie

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు 12 సార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేయగా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటించగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి నటించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+