సమంతతో ఆ హీరో కెమిస్ట్రీపై స్టార్ నిర్మాత షాకింగ్ కామెంట్స్
సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద కనిపించి సంవత్సరం దాటి పోయింది. అయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సమంత ప్రస్తుతం ''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరు రెచ్చిపోయి నటించారనే టాక్ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా సమంత గురించి ఈ చిత్ర నిర్మాత గినా గార్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. వరుణ్ ధావన్-సమంత కెమిస్ట్రీపై సిటాడెల్ నిర్మాత గినా గార్డి పొగడ్తల వర్షం కురిపించారు. సమంత-వరుణ్ ధావన్ జోడి అద్భుతంగా ఉందని అభివర్ణించారు. వరుణ్ ధావన్-సమంత జోడి బాగా ఆకట్టుకుందని, వారిని చూసి నేను నిజంగా షాక్ అయ్యానని తెలిపారు. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మళ్లీ మళ్లీ చూశానని.. వీరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా అనిపించిందని.. వీరు నటించిన రోల్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉంటాయని గినా గార్డి చెప్పుకొచ్చారు. తాజాగా సిటాడెల్ ప్రీమియర్ ను లండన్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరయ్యారు.ఈ వేడుకకు వరుణ్ ధావన్ దూరంగా ఉన్నారు. దీంతో అతన్ని మిస్ అవుతున్నట్టుగా సమంత పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications