ఇదెక్కడి మాస్ రా మామ.. నాని ప్యారడైజ్ మూవీలో విలన్ గా ఆ హీరోనా..?
ఓ పక్క హీరోగా.. మరో పక్క నిర్మాతగా ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు హీరో నాని. హీరోగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. నిర్మాతగా కూడా లేటెస్ట్ గానే కోర్టు సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే నాని నటిస్తున్న హిట్ 3 రిలీజ్ కాబోతుండగా.. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నాడు.
రీసెంట్ గానే నాని పుట్టిన రోజు సందర్భంగా నాని - శ్రీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి 'ది ప్యారడైజ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. అలానే రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. నాని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రా అండ్ రస్టిక్ మోడ్ లో నాని కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దసరా లాంటి భారీ హిట్ తరువాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా గ్లింప్స్ ఉండడంతో సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకుతున్నాయి. రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో నాని పూర్తిగా కనిపించకపోయినా.. ఆ బ్యాగ్రౌండ్ వాయిస్, మ్యూజిక్ అదరగొట్టేశాయి. మరీ ముఖ్యంగా సినిమా విజువల్స్ వేరే ప్రపంచానికి మనల్ని తీసుకువెళితే.. అసభ్య పదజాలం మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. నాని సినిమాలో ఈ తరహా డైలాగ్ ఏంటి అని ఒకింత షాక్ అయ్యారు. హిట్ 3 సినిమా టీజర్ లో బీప్ ఒక ఎత్తైతే.. ఈ సినిమాలో ఎన్ని బీప్స్ పడతాయో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో నాని తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి నటిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నటి రమ్యకృష్ణ తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు అనూహ్యంగా సినీ వర్గాల్లో డిస్కషన్ ప్రకారం ఈ చిత్రంలో విలన్ గా సీనియర్ స్టార్ హీరో నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన కనుక ఈ మూవీలో నిజంగా విలన్ రోల్ చేస్తే థియేటర్లు తగలబడిపోవడం గ్యారంటీ అని చెబుతున్నారు.
ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ఆయనే కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. కథ నచ్చడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలో విలన్ గా గుర్తుండి పోయే పాత్రల్లో నటించిన మోహన్ బాబు.. మళ్లీ విలన్ గా చేస్తే గూస్ బంప్స్ కన్ఫార్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ విషయం నిజమో కాదో అని.












Click it and Unblock the Notifications