Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'కూలీ' ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్ ..టాక్ ఎలా ఉందంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించగా, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున విలన్ పాత్ర పోషించారు. వీరితో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఈ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దుబాయ్‌లో జరిగిన సెన్సార్ ప్రీమియర్‌లో కూలీ సినిమా చూసిన ఉమైర్ సంధు తన రివ్యూను ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ చేశారు.రజనీకాంత్ ఈ సినిమాలో తన పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్‌తో దుమ్ము దులిపేశారు.

Coolie Early Buzz A Lokesh Kanagaraj Masterpiece Hailed as Rajinikanth s Best

సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. కథ, స్క్రీన్ ప్లే యావరేజ్‌గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా చివరి 20 నిమిషాలు, ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఉమైర్ సంధు ఈ సినిమాకు 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు. మొత్తంగా, రజనీకాంత్ అభిమానులకు ఈ సినిమా ఓ కన్నుల పండగ అని, ముఖ్యంగా నాగార్జున విలన్ పాత్ర అదరగొట్టిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ రివ్యూతో కూలీ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+