పెళ్లికి ముందు నేను ఎవరితో పడుకుంటానా అనేది అది నా ఇష్టం..స్టార్ హీరో భార్య సంచలనం
సినిమా ప్రపంచంలో ప్రేమ, అనుబంధాలు కేవలం తెర వరకే పరిమితం కావు. తరచూ హీరో, హీరోయిన్ల మధ్య ఏర్పడే అనుబంధాలు, డేటింగ్ వార్తలు ఇండస్ట్రీలో నిత్య చర్చనీయాంశాలు. ముఖ్యంగా బాలీవుడ్‌లో, అనేకమంది స్టార్స్ ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉండి, తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ తరం నటీనటులు తమ వ్యక్తిగత జీవితం గురించి, లైంగిక సంబంధాల గురించి కూడా నిర్మొహమాటంగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు.
ఈ బహిరంగ సంస్కృతి సినీ తారల జీవితాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ షాకింగ్‌గా మారాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే .దీపికా పదుకొనే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత 10 ఏళ్లకుపైగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఇదే సమయంలో అమ్మడు పలు ఎఫైర్లతో కూడా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ సింగ్‌తో ప్రేమాయణం సాగించింది. అంతకు ముందు క్రికెటర్ ధోనీ, యువరాజ్ సింగ్‌తో కూడా రిలేషన్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి.

వీరితో బ్రేకప్ తర్వాత మరో హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడింది.కొంతకాలం డేటింగ్ చేసిన వీరిద్దరు ఆ తర్వాత తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లారు.దీపికా పదుకొనే ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే దీపికా పదుకొనే ఇటీవల నిత్య వార్తల్లో నిలుస్తున్నారు. రెండు పెద్ద తెలుగు సినిమాల నుంచి దీపికా పదుకొనేను తొలగించడం జరిగింది. కల్కి 2, స్పిరిట్ వంటి సినిమాలు దీపికా పదుకొనే చేజారిపోయాయి. ఇదిలా ఉంటే దీపికా పదుకొనే ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
దీపికా మాట్లాడుతూ.. నేను పెళ్లికి ముందు శృంగారం చేసుకుంటానా? లేక పెళ్లి తర్వాత చేసుకుంటానా? అనేది పూర్తిగా నా ఇష్టం. నేను ఒక అబ్బాయిని కేవలం ప్రేమిస్తానా, లేక అతనిపై మోజు మాత్రమే పడతానా అనేది కూడా నా వ్యక్తిగత విషయం. అంతేకాదు, నేను బిడ్డను కనాలనుకుంటున్నానా లేదా అనే నిర్ణయం కూడా నాదే అంటూ తన జీవితంలోని కీలక అంశాలపై స్పష్టత ఇచ్చింది.
మీడియాలో ఎన్ని ఊహాగానాలు, రూమర్స్ వచ్చినా, తన జీవితం అనేది కేవలం తన కోసమేనని, వేరేవారి అంచనాలకు లేదా అభిప్రాయాలకు అనుగుణంగా తాను మారాల్సిన అవసరం లేదని ఈ వ్యాఖ్యల ద్వారా దీపికా గట్టిగా స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications