ప్రైవేట్ జెట్ కొన్న జూనియర్ ఎన్టీఆర్?

ఆకర్షణీయంగా ఉంటూ ఎప్పుడూ ప్రజలను ఆకట్టుకునే కళారంగంలో ఉండేవారి గురించిన వార్తలు తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. అందులోను సినిమా రంగంలో స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా చెలామణి అయ్యేవారి గురించి అయితే అడుగు తీసి అడుగేసినా వార్తే అవుతుంది. ఈ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14వ తేదీన వార్2ను విడుదల చేయనున్నారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానరుపై భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ఇది రూపుదిద్దుకుంటోంది.

ఉందనే అభిమానులు నమ్ముతున్నారు
ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తోంది. అలాగే తారక్ కు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని కూడా రాసింది. రూ.500 కోట్ల ఆస్తులు తారక్ కు ఉన్నాయని, అంతేకాకుండా ఖరీదైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా అతని సొంతమని రాసుకొచ్చింది. దీంతోపాటు ఒక ప్రయివేట్ జెట్ విమానాన్ని తారక్ కొన్నారని, దాని విలువ రూ.80 కోట్లు అని, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే అందులోనే వెళతారంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వార్తను తారక్ టీం కూడా ఖండించకపోవడంతో తమ హీరోకు జెంట్ ఉందనే అభిప్రాయంలో అభిమానులున్నారు.

Did Junior NTR buy a private jet

ఈ సినిమాలో కూడా రెండు పాటలతో సరిపెడుతున్నారు
ప్రస్తుతం వార్ 2తోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇండియా, చైనా, మయన్మార్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సినిమాలో కేవలం రెండు పాటలే ఉండటం విశేషం. పాటలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కూడా రెండు పాటలతో సరిపుచ్చారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్నారు. గ్లోబల్ హీరోగా అవతరించిన తర్వాత జపాన్ లో విపరీతమైన మార్కెట్ ను తారక్ పెంచుకున్నారు. తన సినిమాకు అక్కడ మినిమం గ్యారంటీ ఉంటోంది. ప్రతి సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+