బాలయ్య పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసింది చిరంజీవి అనే విషయం మీకు తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా వెలుగులీనుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య ఉన్న స్నేహం గురించి ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంటుంది. బయట అభిమానుల మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ, చిరంజీవి, బాలకృష్ణ మధ్య వ్యక్తిగతంగా చాలా మంచి అనుబంధం ఉంది. ఒకరినొకరు 'బాలయ్య', 'చిరంజీవి గారు' అని ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో బాలకృష్ణ స్వయంగా 'నాకు ఉన్న ఒకే ఒక్క ప్రాణ స్నేహితుడు చిరంజీవి' అని ప్రకటించారు.
పెళ్లి పనుల్లో సాయం చేసేవారు
బాలకృష్ణ వివాహం 1982 డిసెంబర్ 8న జరిగింది. ఆ సమయానికి చిరంజీవి అప్పటికే టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి, చైతన్య రథంపై ఊరూరా తిరుగుతూ ప్రచారంలో చాలా బిజీగా ఉండేవారు. షూటింగ్‌ల కంటే ముందే నందమూరి కుటుంబంతో ఉన్న చనువుతో చిరంజీవి ఆ పెళ్లికి హాజరై, వచ్చిన అతిథులను పలకరించడం, ఏర్పాట్లను పర్యవేక్షించడం వంటివి చేశారు.

పరిశ్రమకు చెందిన సీనియర్లంతా తరుచుగా ఈ విషయాన్ని చెబుతుంటారు. ఆ రోజుల్లో సినిమా హీరోల మధ్య ఇప్పుడున్నంత కమర్షియల్ హద్దులు ఉండేవి కావు. ఒకరి ఇంట్లో వేడుక జరిగితే మరొకరు వచ్చి పనుల్లో సాయం చేయడం సహజంగా ఉండేది. చిరంజీవి కూడా అదే పద్ధతిలో బాలయ్య పెళ్లిలో ఒక ఆత్మీయుడిలా మెలిగారు.
తర్వాత సీజన్ కు చిరును తీసుకురావాలని
ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకలో చిరంజీవి అతిథిగా విచ్చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాము కలిసి ఉన్న ఫోటోలు, ఒకరి ఇంట్లో ఒకరం భోజనం చేసిన సందర్భాల గురించి మాట్లాడుతూ వారి మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని చెప్పారు. అన్ స్టాపబుల్ షోకు చిరంజీవిని పిలవాలనే ఆలోచనలో బాలయ్య ఉండేవారు.
అయితే కొన్ని సందర్భాల్లో కుదర్లేదు. ఈసారి సీజన్ కు మాత్రం చిరంజీవిని తీసుకురావాలనే పట్టుదలతో బాలయ్య, అల్లు అరవింద్ ఉన్నారు. కాబట్టి తర్వాత సీజన్ లో చిరంజీవిని, బాలయ్యను అన్ స్టాపబుల్ షో ద్వారా ఒకే వేదికపై ఓ గంట లేదంటే 2 గంటల సమయం చూసే భాగ్యం అభిమానులకు కలగబోతోందని చెప్పొచ్చు.














Click it and Unblock the Notifications