చిరంజీవి, రామ్ చరణ్ మధ్య బయపడ్డ విభేదాలు...?
మెగాస్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చిరంజీవి ఆయనకు చేదోడుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా కథల ఎంపికలో చిరంజీవి జోక్యం ఉంటుంది. రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అటు రామ్ చరణ్ సైతం తండ్రి మాటను కాదనకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేస్తుంటారు.
అయితే ఓ విషయంలో మాత్రం చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాను రామ్ చరణ్‌తో రీమేక్ చేయాలని చిరంజీవికి కోరికుందట. కానీ రామ్ చరణ్‌కు మాత్రం చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడంట.

అయితే జగదీక వీరుడు అతిలోక సుందరి తనకు పెద్దగా సెట్ కాదని, గ్యాంగ్ లీడర్ సినిమా తనకు బాగా సూట్ అవుతుందని రామ్ చరణ్ చెబుతున్నారట. ఒకవేళ చిరు మాట చరణ్ వినకపోతే వీరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి తండ్రి మాట విని రామ్ చరణ్ జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాను రీమేక్ చేస్తారో లేదో చూడాలి.
ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. చిరంజీవి సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన రెడీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications