తెలంగాణ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎంల ప్రశంసలు - 'ది 100' డైరెక్టర్
తెలుగు బుల్లితెరను ఓ ఊపు ఊపిన సీరియల్స్ అంటే 'చక్రవాకం', 'మొగలిరేకులు' అనే చెప్పుకోవాలి. ఈ రెండు సీరియల్స్‌లోను ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు ఆర్కే సాగర్. ప్రత్యేకంగా 'మొగలిరేకులు'లో ఆయన పోషించిన ఆర్కే నాయుడు పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. ఆ క్యారెక్టర్ క్రేజ్‌తోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాగర్ హీరోగా 'సిద్ధార్థ్' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకు రాలేకపోయినా.. 'షాదీ ముబారక్' వంటి వినోదాత్మక చిత్రంతో మంచి మార్కులు కొట్టాడు.
ఇప్పుడు లేటెస్ట్ గా 'ది 100' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైబర్ క్రైమ్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాను రాఘవ్ ఓంకార్ శశిధర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. జూలై 11న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ..

ఇది కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. నిజాయితీ, బాధ్యత, న్యాయం కోసం పోరాటం చేసే ఒక పోలీస్ అధికారి కథ. ఇందులో ఉన్న భావోద్వేగాలు, సామాజిక సందేశం మహిళా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది" అన్నారు. అలాగే "ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉంది. నాకు తోడుగా నిలిచిన నిర్మాతలు రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్కే సాగర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు" అని తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎంలు మెచ్చుకున్నారు..
ఈ చిత్రంలో ఆర్కే సాగర్ పోషించిన ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఆయన నటనలో చూపించిన ఆత్మీయత, న్యాయపాలకుడిగా చూపిన బాధ్యత ప్రేక్షకుల మనసుల్ని తాకుతోంది. అదే విధంగా నాయికలుగా నటించిన మిషా నారంగ్ మరియు ధన్య బాలకృష్ణ పాత్రలు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇంతకుమించి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం ఏంటంటే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు, అంజనా దేవి, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోవడం. ఇదే నాకు గొప్ప విజయం అంటూ వ్యాఖ్యానించారు.
-
ఎన్డీఏలోకి టీవీకే విజయ్, పవన్ కల్యాణ్ కీలక మంత్రాంగం..!? -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
టార్గెట్ ఒలింపిక్స్: సీఎం రేవంత్ కీలక నిర్ణయం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications