మెగాస్టార్ చిరంజీవి పదోతరగతి సర్టిఫికేట్‌లో ఏ పేరుందో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. ఎటువంటి బాగ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన డ్యాన్స్‌తో, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కేవలం తన సంకల్పంతోనే సాధారణ స్థాయినుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. సినిమాల్లోకి రావాలనుకునే ఎంతోమంది నటులకు ఆయనే ఆదర్శం. ఆయన నటన, డ్యాన్స్ ఎంతోమంది యువతకు ఆదర్శం. డెబ్బై ఏళ్ల వయసులో కూడా కుర్రహీరోలతో పోటీపడుతూ సినిమాలు తీసున్నారు. సినిమాల్లోనే కాకుండా మెగాస్టార్‌కి సోషల్‌మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి పూర్తి పేరు అతితక్కువ మందికి తెలుసు. అయితే, ఇప్పడు సామాజిక మాధ్యమంలో చిరంజీవి పదో తరగతి సర్టిఫికెట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్ మెగాస్టార్ చిరింజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని ఉంది. చిరంజీవి తండ్రి పేరు వెంకట్ రావు అని రాసి ఉంది. మెగాస్టార్ పెనుగొండలో పుట్టినట్లు ఈ సర్టిఫికేట్‌లో ఉంది. దీంతో ఇప్పడీ ఈ సర్టిఫికేట్ కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చిరు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.

విశ్వంభర షూటింగ్‌లో బిజిగా ఉన్న మెగాస్టార్..
కేవలం సినిమాలే కాకుండా సమాజసేవలోనూ మెగాస్టార్ తనవంతు సాయం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలోనే ఆయన పద్మ విభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో ఓ ప్రాజెక్టు ఉంది. అదే విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించనున్నారు.

ఇక, ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సం సంక్రాంతికి విడుదల చేస్తున్న చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో అగ్ర నటి తార మెగాస్టార్‌కు జోడిగా నటించనున్నారు. అంతేకాదండోయ్, ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా కనిపించబోతున్నారు. ఇది ఒక సోషియోఫాంటసీ చిత్రంగా తెరకెక్కబోతుంది. దీంతోపాటు ఈ మూవీలో సిస్టర్ సెంటీమెంట్ కూడా ఎక్కువ ప్రాధాన్యమున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications