ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఆధిపత్య పోరు?
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ప్రజాదరణ పొందిన కథానాయకులు ఎవరు అనే విషయమై బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ సంస్థ సర్వే నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. ఇందులో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. వాస్తవానికి రెబల్ స్టార్ తెలుగు పరిశ్రమ స్థాయిని బాహుబలి2 సమయంలో దాటారు. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఉన్న ఖాన్ త్రయంకన్నా ముందంజలో నిలిచి దేశంలోనే నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నారు. ఆయన సినిమాలు తెలుగు, హిందీ, అమెరికాలోనే కాదు తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా హిట్ అవుతున్నాయి.
ప్రభాస్ కు పోటీ ఇచ్చే దిశగా..
ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాలో రెండో స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఈయన కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయినప్పటికీ ఆయన్నుంచి ఇంతవరకు సినిమా రాలేదు. సెప్టెంబరు 27వ తేదీన దేవర రాబోతోంది. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా ఇదే. ఇది సూపర్ హిట్ అయితే మరో పాన్ ఇండియా హీరోగా, ప్రభాస్ కు పోటీ ఇచ్చే హీరోగా అవతరిస్తాడు. ఎందుకంటే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి టాప్ హీరోల సినిమాలన్నీ డిజాస్టర్లవడంతోపాటు నిర్మాతలకు భారీ నష్టాలను తెస్తున్నాయి.

ఆసక్తి చూపని బాలీవుడ్ ప్రేక్షకులు
అక్కడి ప్రేక్షకులు బాలీవుడ్ హీరోల సినిమాలు చూపించడానికి ఆసక్తి చూపించడంలేదు. కేవలం తెలుగు నుంచి వచ్చిన హీరోల సినిమాలే చూస్తున్నారు. అందుకే వార్2 సినిమాలో మరో హీరోగా తారక్ ను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అది కూడా హిట్ అయ్యిందంటే రెండు తెలుగు హీరోలమధ్య పాన్ ఇండియా నెంబర్ వన్ స్థానం కోసం పోటీ జరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇమేజ్ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయన దగ్గరకు చేరుకోవడానికి, ఆయనతో పోటీపడటానికి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరికే అవకాశం ఉంది. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో నటన పరంగా నవరసాలను పోషించగలిగే సత్తా ఉన్న యువహీరో ఆయనొక్కడే. అందుకే బాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా తారక్ కోసం ఎదురు చూస్తున్నారు. దేవర, వార్2.. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఎన్టీఆర్ ఇమేజ్ ఆసాంతం పెరుగుతుంది. అప్పుడు ప్రభాస్, తారక్ మధ్య ఏవిధంగా పోటీ జరుగుతుందనేది చూడటం చాలా ఆసక్తికరంగా మారుతుంది. పాన్ ఇండియా మార్కెట్ పై ఈ ఇద్దరు హీరోల మధ్య ఆధిపత్య పోరు సాగుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications