ఓటీటీలోకి దూసుకొచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. అసలు మిస్ కావొద్దు
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఫహాద్ ఫాజిల్ నటించిన ఉత్కంఠభరితమైన మలయాళ చిత్రం 'ఇరుల్', తెలుగులో 'అపరాధి'గా మీ ముందుకు వచ్చేస్తోంది.
ఒక భయానకమైన రాత్రి, ఒక ప్రేమ జంట మరియు వారి జీవితంలోకి చొరబడిన ఒక అనుమానాస్పద వ్యక్తి... ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో హార్ట్ బీట్‌ను పెంచే ఒక అద్భుతమైన థ్రిల్లర్ సినిమా ఇది.

'పుష్ప'లో తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఫహాద్ ఫాజిల్, ఈ సినిమాలో ఒక సీరియల్ కిల్లర్‌గా భయానకమైన పాత్రను పోషించారు. దర్శనా రాజేంద్రన్ , సౌబిన్ షాహిర్ కూడా తమ అద్భుతమైన నటనతో సినిమాకు మరింత గుర్తింపు తెచ్చారు.
'అపరాధి' ఈరోజే (మే 8, 2025) ఆహా (Aha) ఓటీటీ వేదికగా విడుదలైంది. ఒకే ఒక్క ఇంట్లో, కేవలం ముగ్గురు వ్యక్తులతో నడిచే ఈ కథ మిమ్మల్ని చివరి నిమిషం వరకు సీటు అంచున కూర్చోబెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మిస్టరీ, సస్పెన్స్ ఇష్టపడేవారికి ఇది ఒక విందులాంటి సినిమా.












Click it and Unblock the Notifications