ఎన్టీఆర్, అనిరుధ్... చొక్కాకు కాలర్ ఉందని ఎగరేయొద్దు?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. దేవర సినిమా కూడా సోసోగానే ఉన్నప్పటికీ తనకున్న మాస్ ఇమేజ్ వల్ల దాన్ని నిలబెట్టారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత తొలిసారిగా వార్ 2 రూపంలో ఫ్లాప్ సినిమా ఎదురైంది. ఈ సినిమా ముందస్తు విడుదల వేడుక హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా తారక్ కాలర్ ఎగరేసి మాట్లాడారు. అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందన్నారు. హిందీకన్నా తెలుగులో ఒక్క రూపాయి అయినా ఎక్కువగా వసూలు చేస్తానంటూ సూర్యదేవర నాగవంశీ ఈసినిమాను రూ.90 కోట్లు పెట్టి కొన్నారు. ఇప్పుడు నిండా మునిగిపోయారు.

కూలీలో బీజీఎం మ్యాజిక్ జరగలేదు
అనిరుధ్ రవిచంద్ర సంగీత దర్శకత్వం లేకుండా తాము సినిమా చేయమని చాలామంది హీరోలు, దర్శకులు అంటున్నారు. ఇతర సంగీత దర్శకుల వద్ద వీరికి నచ్చినట్లుగా బాణీలు తీసుకోవాలి. అప్పుడే దర్శుకుల ప్రతిభ బయటపడుతుంది. అలా కాకుండా రెండు సినిమాలకు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడని అందరూ అతనివైపే పరిగెత్తితే ఏమీ మిగలదు. అంతా డొల్ల అవుతుంది. విక్రమ్, జైలర్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయంటే అందుకు ప్రధాన కారణాల్లో అనిరుధ్ సంగీతం కూడా ఒకటి. కానీ కూలీ సినిమాలో ఆ మ్యాజిక్ జరగలేదు. సౌబిన్ షాహిర్ పై తీసిన మోనికా పాట విడుదలైనప్పుడు తిరుగులేదు అనుకున్నారు. కానీ సినిమాలో బీజీఎం మ్యాజిక్ జరగలేదు. గతంలో ఒకసారి అనిరుధ్ కూడా కాలర్ ఎగరేసి సంగీతం అదిరిపోయే స్థాయిలో ఉంటుందని ఒక సినిమా గురించి చెప్పారు.

Fans are asking junior NTR and Anirudh ravichandar to make films with caution

జాగ్రత్తగా పనిచేయాలని కోరుతున్న అభిమానులు
బాలీవుడ్ లో నేరు సినిమా చేయాలనుకోవడం తారక్ మంచి నిర్ణయమే. అయితే ఎంచుకున్న కథే తప్పు. ఆర్ఆర్ఆర్ లో పాత్ర తగ్గిందని అభిమానులు ఇప్పటికీ బాధపడుతుంటే, మళ్లీ వార్ 2లో కూడా పాత్ర తగ్గింది. ఎన్టీఆర్ లాంటి నటుడికి అది అవసరమా? అంటే అతనికి ఆ సమయంలో అవసరం అనిపించిందేమో. స్థాయిని తగ్గించుకోకుండా తన సినిమాలు తాను చేస్తే చాలు. జపాన్ లో అంత క్రేజ్ వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? లేదుగా.. వచ్చింది. ఏదైనా అంతే.. మన సినిమాలు మనం చేసుకుంటూ వెళుతుంటే మన స్థాయి కూడా అలా అలా పెరుగుతూ పోతుంది. ఇప్పటికైనా తారక్, అనిరుధ్ జాగ్రత్తగా పనిచేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+