హనుమాన్ వసూళ్లలో తేజ సజ్జా ఎంత వాటా తీసుకున్నాడో తెలుసా?

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో హనుమాన్ ఒకటి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు విడుదలవుతుండటంతో హనుమాన్ ను వాయిదా వేసుకోవాలంటూ సినీ పెద్దల నుంచి నిర్మాతలపై ఒత్తిడి వచ్చింది. అయితే సినిమా కంటెంట్ పై నమ్మకంతో ఉన్న చిత్ర యూనిట్ వెనక్కి తగ్గలేదు. వారి అంచనాలకు తగ్గట్లుగానే వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ఒకరకంగా ఇది ఎవరూ ఊహించని అద్భుతమని చెప్పొచ్చు. ఊహకు అందని విధంగా వసూళ్లను రాబడుతున్న ఈ సినిమాలో పనిచేసినవారికి నిర్మాత వచ్చిన లాభాల్లో ఎంతిచ్చాడనే ప్రశ్న అందరిలోను తలెత్తుతోంది. వాస్తవానికి సినిమా రంగం అనే కాకుండా ఏ రంగంలోనైనా ఊహకు అందని రీతిలో విజయం సాధిస్తే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహకంగా నగదు ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతున్న విషయమే. అలాగే హనుమాన్ సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కోటి రూపాయలు, హీరో తేజ సజ్జా కోటిరూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

hanuman movie derictor and hero remunaration details

అయితే సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయం సాధించడంతో నిర్మాత నిరంజన్ రెడ్డి హీరోకు అదనంగా రూ.5 కోట్లు, డైరెక్టర్ కు రూ.6 కోట్లు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మీడియం రేంజ్ హీరోలు కూడా అంత పారితోషికం అందుకోని పరిస్థితుల్లో ప్రారంభ దశలోనే ఉన్న ఒక యువ కథానాయకుడు ఇంత రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగానే అద్భుతమని చెప్పొచ్చు. తనకున్న డిమాండ్ ను, వచ్చిన పేరును భవిష్యత్తులో తేజ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+