Hanuman: బాక్సాఫీస్ కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తున్న హనుమాన్.. ఇంకా హౌస్ ఫుల్లే..

చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద మూవీలను వెనక్కు నెట్టింది. థియేటర్లు ఇవ్వుకున్నా ధైర్యంగా నిలబడి గెలిచింది హనుమాన్ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమాతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. హనుమంతుడు ఆకాశంలో ఎగిరినట్లుగా.. హనుమాన్ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. హనుమాన్ చిత్రం జనవరి 12 విడుదలయింది. ఇప్పటికీ కూడా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబాడుతున్నారు.

విడుదలై 15 రోజులైనా హనుమాన్ పై కాసుల వర్షం కురుస్తోంది. ఈ మూవీ ఇప్పటికే రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారింగా ప్రకటించింది. ఈ మూవీకి ఇంకా ఆధారణ కొనసాగుతోంది. దీంతో సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. హనుమాన్ మూవీ త్వరలో రూ.300 కోట్లు కలెక్షన్లు చేసే అవకాశం కనిపిస్తోంది. హనుమాన్ మూవీ మేకర్స్ అయోధ్య రామమందిరానికి విరాళం ప్రకటించారు.

Hanuman movie is creating record in box office collections

కొద్ది రోజుల క్రితం ప్రతి టికెట్ పై రూ. 5 చొప్పున మొత్తం రూ.2.66 కోట్లను అయెధ్య రామమందిరానికి విరాళంగా అందించారు. మరోవైపు ఈ చిత్రానికి సిక్వెల్ తెరకెక్కించనున్నారు. సిక్వెల్ ఓ స్టార్ హీరో నటిస్తారని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు జై హనుమాన్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు హనుమా చిత్ర యూనిట్ ప్రముఖులను కలుస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశం సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఈ చిత్రం విజయంపై హీరో తేజ ఆనందం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+