తెలుగు స్టార్ హీరోలందరినీ వెనక్కు నెట్టిన 'హనుమాన్'
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో హనుమాన్ సినిమాకే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృత అయ్యర్ కథానాయిక. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతోపాటు విడుదలైన పెద్ద సినిమా గుంటూరు కారానికి పోటీగా భారీ కలెక్షన్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.
విడుదలైన మొదటివారమే రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తాజాగా రూ.170కోట్ల గ్రాస్ ను దాటేసింది. ప్రస్తుతం హనుమాన్ మూవీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. ఓవర్సీస్ లో తెలుగులో ఉన్న టాప్ హీరోలకు కూడా అందని రికార్డును సాధించింది. సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే భారీ కలెక్షన్లు రాబడుతూ రెండోవారంలోకి ఎంటరైంది. విదేశాల్లో ఏకంగా నాలుగు మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్ల కి పైగా వసూలు చేసిన సినిమాలు తెలుగులో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. బాహుబలి2 మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో మొదటిస్థానంలో నిలబడింది. ఆర్ఆర్ఆర్ చిత్రం రెండోస్థానాన్ని దక్కించుకోగా మూడోస్థానంలో బాహుబలి1 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో అల వైకుంఠపురం, రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు, మహర్షి చిత్రాలు నిలిచాయి. ప్రస్తుతం హనుమాన్ మూవీ రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల వసూలు దివగా పరుగులు పెడుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా అనేక సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలై గ్లోబస్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ సినిమాపై ఇప్పటినుంచే భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దానికి బిజినెస్ భారీగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications