ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు రోబో శంకర్ మృతి
తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్(46) కన్నుమూశారు. నిన్న చెన్నైలో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే చిత్ర యూనిట్ అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. రోబో శంకర్ మృతితో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తమిళ సినిమా ఇండస్ట్రీలో రోబో శంకర్ కు కమెడియన్ గా మంచి గుర్తింపు ఉంది. రోబో శంకర్ అకాల మరణంతో ఆయన ఫ్యాన్స్ , కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. నిన్న చెన్నైలో ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన్న శంకర్.. షూటింగ్ స్పాట్ లోనే స్పృహ తప్పి పడిపోయారు. అయితే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం రోబో శంకర్ మృతి చెందారు.
రోబో శంకర్ మృతితో చిత్ర సీమ విషాదంలోకి వెళ్లింది. పలువురు సెలబ్రిటీలు ఆయనకు సంతాపం తెలిపారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ వార్తపై విచారం వ్యక్తం చేశారు. తమ్ముడు వెళ్లిపోయావా అంటూ ఎమోషనల్ ట్వీట్ పోస్టు చేశారు. మరోవైపు రోబో శంకర్ మృతదేహాన్ని ఈ రాత్రి చెన్నైలోని వలసరవక్కంలోని ఆయన ఇంటికి తరలించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నగరంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు రోబో శంకర్. తనదైన శైలిలో హాస్యాన్ని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. విశ్వాసం, పులి, మారి, అలాగే శివకార్తికేయన్ తో వెలైక్కారన్ తదితర సినిమాలతో పాటు కెరీర్ మొత్తంలో 100 కు పైగా చిత్రాల్లో నటించారు రోబో శంకర్. అయితే హాస్య నటుడు రోబో శంకర్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. ఆయన కామెర్లుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా ఇటీవల సినిమాలను తగ్గించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications