రీరిలీజ్‌ సినిమాల్లో టాప్-10 కలెక్షన్లు సాధించిన హీరోలు

మన తెలుగు హీరోలు మూడేళ్లకో సినిమా, నాలుగేళ్లకో సినిమా చేస్తుండటంతో.. ఆ హీరోలు గతంలో చేసిన సినిమాలనే రీ రిలీజ్ చేయిస్తూ అభిమానులను సంతృప్తి పరుస్తున్నారు. అభిమానులు కూడా వీటిని మరోసారి థియేటర్లో చూసి ఆనందపడుతున్నారు. అంతేకానీ ఏడాదికి కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు చేసి సినీ పరిశ్రమను, అందులో పనిచేసే కార్మికులను నిలబెట్టమని ఏ అభిమానీ అడగడంలేదు. ప్రతి హీరో సినిమా రీ రిలీజ్ అవడం అనేది ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. అది చూసి మరో హీరో సినిమా, అది చూసి ఇంకో హీరో సినిమా విడుదలవుతూ వస్తున్నాయి.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు
మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా రీరిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే వారం రోజుల్లో మంచి కలెక్టన్లే రాబడుతున్నాయి. తాజాగా అతడు సినిమా రీరిలీజ్ అయింది. అది మొదటి రోజు కేవలం నైజాం ఏరియాలోనే రూ.1.62 కోట్లు రాబట్టింది. టీవీలో 1500 సార్లు టెలికాస్ట్ అయి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ సినిమా థియేటర్ లో విడుదలైనా మంచి కలెక్షన్లే రాబట్టింది. ప్రిన్స్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇది విడుదలైంది. నైజాంలో ప్రత్యేకంగా కొన్ని ప్రీమియర్ షోలు వేయగా రూ.30 లక్షలు వచ్చాయి.

Heroes who achieved top-10 collections in re-released films

టాప్ 1లో ఖలేజా
ఇప్పటివరకు నైజాంలో రీరిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను మొదటిరోజు సాధించి టాప్ 1లో నిలబడిన సినిమా ఖలేజా. దీనికి మొదటిరోజు 3.32 కోట్ల రూపాయలు వచ్చాయి. 2వ స్థానంలో మురారి రూ.2.93 కోట్లు, 3వ స్థానంలో గబ్బర్ సింగ్ రూ.2.52 కోట్లు, 4వ స్థానంలో బిజినెస్ మెన్ రూ.2.46 కోట్లు, 5వ స్థానంలో ఖుషి సినిమాకు రూ.1.65 కోట్లు, 6వ స్థానంలో ఆర్య2 రూ.1.65 కోట్లు, 7వ స్థానంలో అతడు రూ.1.62 కోట్లు, 8వ స్థానంలో జల్సా రూ.1.26 కోట్లు, 9వ స్థానంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు రూ.1.26 కోట్లు, 10వ స్థానంలో సలార్ రూ.1.20 కోట్లతో నైజాంలో టాప్ 10లో నిలిచాయి. రానున్న రోజుల్లో అతడుకు ఇంకా ఎంత కలెక్షన్ వస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+