సీఎం కొడుకుతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన హీరోయిన్
సినీ పరిశ్రమ, ముఖ్యంగా బాలీవుడ్ అంటేనే రంగుల ప్రపంచం. తెరపై కనిపించే ప్రేమ కథల కంటే తెర వెనుక జరిగే రొమాన్స్, ఎఫైర్ల గురించి చర్చ సర్వసాధారణం. బాలీవుడ్‌లో ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ఈ పరిణామాలను ఇండస్ట్రీలో 'మెచ్యూరిటీ' పేరుతో స్వీకరిస్తూ ఉంటారు.
దక్షిణాదిలో కొంత గోప్యత పాటించినా, బాలీవుడ్ మాత్రం ఎఫైర్ల విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమ, డేటింగ్, బ్రేకప్‌లు, సీక్రెట్ రొమాన్స్‌ల గురించి రూమర్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుత తరం నటీనటులు రిలేషన్షిప్‌ల గురించి, శృంగారం గురించి కూడా మీడియా వేదికలపై, ఇంటర్వ్యూలలో బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడకపోవడం ఈ ట్రెండ్‌లో వచ్చిన ప్రధాన మార్పుగా చెప్పవచ్చు.

తాజాగా ఓ హీరోయిర్ ఏకంగా సీఎం కొడుకుతో హోటల్లో దొరికిపోయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్.కాస్టింగ్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన భూమి ఫెడ్నేకర్ ఆ తర్వాత హీరోయిన్‌గా అవతారం ఎత్తెంది. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈ అమ్మడు సీఎం కొడుకుతో హోటల్‌లో కనిపించి అందిరికి షాక్చిచ్చింది.
మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేతో భూమి ఫెడ్నేకర్ డేటింగ్‌లో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ముంబైలోని బాంద్రా ఉన్న ఓ హోటల్‌లో వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు.యంగ్ గ్లోబల్ లీడర్స్ సభ్యుల కోసం విందు ఏర్పాటు చేయగా.. ఆ పార్టీకి భూమి ఫెడ్నేకర్ సైతం పాల్గొన్నారు.ఆదిత్య ఠాక్రే పిలుపు మేరకే భూమి ఫెడ్నేకర్ ఈ పార్టీకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిత్య ఠాక్రే,భూమి ఫెడ్నేకర్ రిలేషన్‌లో ఉన్నారంటూ నిర్ధారించుకుంటున్నారు. అయితే అలాంటిది ఏమి లేదని వీరి సన్నిహితులు చెబుతున్నారు. వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అంటున్నారు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications