సుడిగాలి సుధీర్‌పై హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ ఆగ్రహం
సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుడిగాలి సుధీర్‌ను బుల్లితెర మెగాస్టార్‌గా పిలుస్తుంటారు. సుడిగాలి సుధీర్ ఉంటే ఆ షో సూపర్ హిట్ అయినట్టే. జబర్థస్త్ షోతో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత టీం లీడర్‌గా ఎదిగాడు. పోవే పోరా, ఢీ వంటి షోలకు యాంకరింగ్ చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తరువాత వీరిద్దరు కలుసుకున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

ఇక రష్మీ -సుడిగాలి సుధీర్‌లు కలిసి షోస్ చేయనప్పటికీ.. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే సుధీర్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. షూటింగ్ గ్యాప్‌లో పలు షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగానే సర్కార్ అనే షోకు యాంకర్‌గా చేస్తున్నాడు. తాజాగా ఈ ఎపిసోడ్‌కి హీరోయిన్ కాజల్ అగర్వాల్ అతిథిగా వచ్చారు. నవీన్ చంద్ర సైతం పాల్గొన్నారు.
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేసి సత్యభామ మూవీ విడుదలకు సిద్ధమైంది. సత్యభామ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, దర్శకుడు సుమన్ చిక్కాల సర్కార్ షోకి రావడం జరిగింది. షో చివర్లో మాత్రం కాజల్ సుధీర్ మీద ఫైర్ ఒక్కసారిగా అయ్యింది. డబ్బులు లెక్కించే టాస్క్ ఇవ్వగా... ఆ గేమ్ లో నిమగ్నమైన కాజల్ ని సుధీర్ తన మాటలతో డిస్ట్రబ్ చేస్తాడు. దాంతో నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావని కాజల్ ఒకింత ఫైర్ అయ్యింది. అయితే ఇదింతా కూడా సరదాగానే జరిగింది. గేమ్ గెలవాలనే కసిలో సుధీర్‌కు అలా చిన్న వార్నింగ్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications