డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ తమ్ముడు అరెస్ట్
డ్రగ్స్ కేసు విషయంలో అధికారులు ప్రస్తుతం సైలెంట్‌గా కనబడడంతో ఆ కేసు నీరుగారిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈ కేసులో ఏకంగా ఓ హీరోయిన్ తమ్ముడు అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు ఈ డ్రగ్స్ కేసులో బాధితులే. తెలుగులో పూరి జగన్నాథ్, ఛార్మీ, ముమైత్ ఖాన్, తరుణ్, సుబ్బరాజు, రవితేజ, తరుణ్ మొదలగు వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వీరిపై పోలీసులు సుదీర్ఘ విచారణ సైతం జరిపారు.
ఇక డ్రగ్స్ కేసు బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ కొంప ముంచిన సంగతి కూడా తెలిసిందే. రియా బయట పెట్టిన పేర్లలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ద కపూర్ వంటి హీరోయిన్స్ మాత్రమే కాకుండా రియా దోస్త్ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ కూడా డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణను ఎదుర్కొంది. తాజాగా మళ్ళీ డ్రగ్స్‌తో హీరోయిన్ రకుల్ తమ్ముడు ఎన్సీబీ అధికారులకి దొరకడం సంచలనంగా మారింది.

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఎన్ని చర్యలు తీసుకుంటున్న డ్రగ్స్, గంజాయిని పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకువస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి యువతకు, వ్యాపారస్తులకు డ్రగ్స్ చేరవేస్తున్నారు. తాజాగా సైబరాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్‌సింగ్‌ను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
-
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications