ఇప్పుడు సమయం నాకు వచ్చింది.. చూస్తారుగా: సమంత

అందాల ముద్దుగుమ్మ సమంత ఇప్పడిప్పుడే బిజీ అవుతోంది. నాగచైతన్యను ఏడు సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అకస్మాత్తుగా 2017లో విడాకులు తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న సమంత మయోసైటిస్ బారిన పడింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదికిపైగా విరామం ప్రకటించింది. అంతకుముందుగా తాను నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగిచ్చేసి తన నిజాయితీని నిరూపించుకుంది.

ఆశ్చర్యపరిచిన నాగచైతన్య
ఎక్కడకు వెళ్లినా, ఏం చేస్తున్నా ఎప్పటికప్పుడు తన వివరాలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులతో దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే వరల్డ్ పికెల్ బాల్ చెన్నై టీంను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో నాగచైతన్య హైదరాబాద్ రేస్ కోర్స్ టీంను కొనుగోలు చేయడం విశేషం. రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న శోభిత ధూళిపాళతో గతనెలలో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరి వివాహం వచ్చే ఏడాది మార్చిలోకానీ, ఏప్రిల్ లోకానీ జరగబోతోంది. ఈ విషయంపై సమంత ఎక్కడా బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.

heroine samantha share latest video in her instagram account a day in my life

ఏ డే ఇన్ మై లైఫ్
తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా A DAY IN MY LIFE అంటూ క్యాప్షన్ పెట్టి వీడియోను షేర్ చేసింది. తాను ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు తాను చేసే పనులన్నింటినీ ఇందులో చూపించింది. దానికి Life's Golden అనే క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఏ డే ఇన్ మై లైఫ్ అనే టైటిల్ పెడితే తనకంటూ ఈరోజు వచ్చిందని, తాను ఎవరిచేతైతే బాధపడ్డానో వారిపై రివెంజ్ తీర్చుకునే సమయం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన తర్వాత వచ్చిందని, ఏం చేస్తానో నాకే తెలియదనేలా అర్థం ఉందని, కానీ తీరా చూస్తే వీడియోలో తన లైఫ్ స్టైల్ పెట్టిందంటూ నెటిజన్లు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఏదన్నా ఉంటే ఇప్పుడు తనకు సమయం వచ్చిందని చూస్తారుగా అని హెచ్చరించేలా ఉండాలని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+