లిప్ లాక్ అతనితోనే చేస్తా..శ్రీలీల హాట్ కామెంట్స్
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చింతంగా శ్రీలీలనే అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..ఆ తరువాత ధమాకా ,స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రొజెక్ట్ 'గుంటూరు కారం'లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్', వైష్ణవ్ తేజ్ 'ఆది కేశవ', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్కంద సినిమా ప్రమోషన్‌లో భాగంగా .. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది. తాజాగా భగవంత్ కేసరి సక్సెస్ అయిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్య్వూలో.. శ్రీ లీల ఒకవేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేయాలని అనుకుంటుందనే ..? ప్రశ్న ఎదురైంది. ఊహించని ప్రశ్నకు కంగుతిన్న శ్రీ లీల.. కాసేపు ఆలోచించి.. తాను ఎవ్వరికీ లిప్ లాక్ ఇవ్వను అంటూ సమాధానం చెప్పేసింది.
ఒకవేళ అలాంటి సీన్ చేయాల్సి వస్తే మాత్రం డైరెక్ట్‌గా నాకు కాబోయే భర్తతోనే చేస్తాను అంటూ కుండ బద్దలు కొట్టేసింది. లిప్ లాక్‌పై శ్రీలీల మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇవ్వడంతో అభిమానులు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల లిప్ లాక్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications