పవన్ కళ్యాణ్‌ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి..!

పవన్ కళ్యాణ్... ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత లాయల్ ఫ్యాన్‌బేస్ కలిగిన హీరోల్లో ఒకరు అనడంలో సందేహం లేదు. హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే కానీ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోల్లోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు హిట్ అయ్యినా, ఫ్లాప్ అయినా అభిమానుల ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఆయన చూడని బాక్సాఫీస్ రికార్డులు లేవనే చెప్పాలి.

ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్‌లో రెండు సినిమాలున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఓజీ " సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

interesting-details-about-pawan-kalyan-film-and-political-career

యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి.

మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. లేటెస్ట్ గానే ఈ చిత్రానికి సంబంధించి తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేసేశారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్, 2023లో బ్రో సినిమాలు విడుదల చేశారు. అంటే ఆయన నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా థియేటర్లలోకి వచ్చింది. 2024లో రాజకీయ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాలు పూర్తి కావడం కష్టమని అనుకున్నారు. "హరి హర వీరమల్లు" నిలిచిపోతుందని, "ఓజీ" ఆలస్యమవుతుందని, "ఉస్తాద్ భగత్ సింగ్" అసలు జరగకపోవచ్చని అనుమానించారు.

కానీ పవన్ కళ్యాణ్ అందరినీ ఆశ్చర్యపరిచేలా కొద్ది నెలల్లోనే ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేశారు. జూలైలో "హరి హర వీరమల్లు" విడుదల కాగా.. ఇప్పుడు వరుసగా "ఓజీ", "ఉస్తాద్ భగత్ సింగ్" కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి.

అయితే ప్రతి ఒక్క అభిమాని తమ ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతుండగా.. థియేటర్లు సైతం వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ గా కీలక పదవిలో ఉండి కూడా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఆయనను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+