బుర్ర పాడయ్యే న్యూస్: బిగ్‌బాస్ హోస్ట్‌కు రెమ్యునరేషన్ రూ.150 కోట్లు..?
భారతదేశంలో అత్యధికంగా చర్చించుకునే రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ 19... డ్రామా, షాకింగ్ ఎలిమినేషన్లు, తీవ్రమైన గొడవలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ హంగామా అంతటిలో మళ్లీ ప్రధాన వార్తగా నిలుస్తున్న అంశం మాత్రం... హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తీసుకుంటున్న భారీ పారితోషికం గురించే..
సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్:అంకెల్లో మాయాజాలం..
సల్మాన్ ఖాన్ సీజన్ 4 నుండి బిగ్ బాస్ హోస్ట్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పన్నెండు ఏళ్లకు పైగా షోకు ఆయనే ముఖచిత్రంగా, ఆత్మగా నిలిచారు. అయితే, ఆయన ప్రతి సీజన్‌కు తన పారితోషికాన్ని భారీగా పెంచుకుంటూ పోతున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉంటాయి.తాజా నివేదికల ప్రకారం, ఈ సూపర్‌స్టార్ కేవలం 15 వారాల హోస్టింగ్ కోసం అక్షరాలా రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మధ్య ఛార్జ్ చేస్తున్నారట. ఈ అంకెలు నిజంగా షాకింగ్‌గా అనిపించక మానవు.

ఆయన ప్రతి పైసాకు అర్హుడే..
ఈ ఊహాగానాలపై బనిజే ఏషియా (Banijay Asia),ఎండమోల్‌షైన్ ఇండియాకు చెందిన నిర్మాత రిషి నేగి స్పందించారు.ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి.ఈ కాంట్రాక్ట్ సల్మాన్‌ఖాన్‌కు, జియో హాట్‌స్టార్‌కు మధ్య జరిగింది కాబట్టి ఆ వివరాలు తనకు తెలియవని అన్నారు. కానీ...వార్తల్లో ఉన్న మొత్తం ఏదైనా సరే, ఆయన దానికి పూర్తి అర్హుడని స్పష్టం చేశారు. వారాంతపు ఎపిసోడ్‌లలో సల్లూ భాయ్ ఉన్నంత వరకు తను చాలా ఎంజాయ్ చేస్తానని నేగి తెలిపారు.
సల్మాన్ పక్షపాతం చూపుతారా?
సల్మాన్ ఖాన్ కొన్నిసార్లు హౌస్‌మేట్స్ పట్ల పక్షపాతం చూపుతారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.దీనిపై రిషి నేగి స్పష్టత ఇచ్చారు.హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ క్రియేటివ్ ప్రాసెస్‌లో లోతుగా పాల్గొంటారని, 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్స్ కంటే ముందే హౌస్‌లో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఆయన వ్యక్తిగతంగా సమీక్షిస్తారని నేగి వెల్లడించారు.హౌస్‌లో ఏం జరుగుతుందో ఆయన పూర్తి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందని చెప్పిన నేగి... తాము క్రియేటర్స్‌గా, ఆడియెన్స్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు ఆయన అభిప్రాయాన్ని కూడా కలిపి వీకెండ్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తామని వివరించారు.
సల్మాన్ షోను వీడుతున్నారా?
సల్మాన్ ఖాన్ త్వరలో షో నుంచి తప్పుకుంటున్నారనే పుకార్లు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.ఈ రూమర్స్‌పై నేగి మాట్లాడుతూ.. "కొన్నిసార్లు ఆయన సెంటిమెంటల్‌గా షోకు కనెక్ట్ అయ్యారు" అని అన్నారు.షోను ఇక చేయలేనేమో అని ఆయన భావించిన సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించిన నేగి...ఇప్పుడు బిగ్ బాస్‌తో ఆయనకు బలమైన భావోద్వేగ అనుబంధం ఏర్పడిందని తెలిపారు. ఆయన స్టేజీపై ఇన్వాల్వ్ అయ్యే తీరు చూస్తే, అది లోపలి నుంచి వస్తుందనే విషయం అర్థమవుతుందని చెబుతూ, సల్మాన్ ప్రస్తుతానికి షోను వీడే ఉద్దేశంలో లేరని స్పష్టం చేశారు.మరి రూ. 150 కోట్లు తీసుకుంటున్న సల్మాన్ ఈ సీజన్‌ను ఎంత విజయవంతంగా ముగిస్తారో చూడాలి.
-
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..!












Click it and Unblock the Notifications