కేసు నుంచి అల్లు అర్జున్‌ను బయట పడేసేది అతనొక్కడే?

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతిచెందడం, ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైల్ట్ ఫైర్ అవడం, సినీ పరిశ్రమకు టికెట్ ధరలుండవని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అదేరోజు రాత్రి అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం... ఇలా అన్ని సంఘటనలు ఒకదానివెంట ఒకటిగా జరిగిపోయాయి. తాజగా అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ నాయకులు రాళ్లు, టమాటాలతో దాడిచేస్తే రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితులను అరెస్ట్ చేయగా వారు బెయిల్ పై బయటకు వచ్చారు.

న్యాయవ్యవస్థకే వదిలేద్దామంటే సరిపోయేది
ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందేకానీ సడలింపులు మాత్రం కనపడటంలేదు. బయటపడే మార్గం కనపడటంలేదు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయడంతో కేసు మరింత బిగుస్తోంది. కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్నప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది ప్రధాన తప్పు. ఏమీ మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధ్యత తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయవ్యవస్థ పరిధిలో విషయం ఉందికాబట్టి న్యాయవ్యవస్థకే వదిలేద్దాం అని పొడిగా రెండు మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేదంటున్నారు.

Is the only one can exonerated Allu Arjun from the sandhya theatre case

లాజిక్ మరిచిపోయిన అల్లు అర్జున్
సంఘటన జరిగిన తర్వాత, అందులో ఒక సెలబ్రిటీ చిక్కుకున్న తర్వాత వాటిపై అనేక ప్రచారాలు జరుగుతుంటాయి. అందులోను అల్లు అర్జున్ స్టార్ హీరో. మరే చిన్న హీరో అయినా ఇంత సమస్య ఉండేదికాదు. స్పందిస్తే ప్రచారం ఇంకా ఎక్కువ జరుగుతుంది అనే విషయాన్ని, అందులో ఉన్న లాజిక్ ను అల్లు అర్జున్ గ్రహించలేకపోయాడని మరికొందరు అంటుంటే, అల్లు అర్జున్ కు ప్రచార యావ ఎక్కువని మరికొందరు అంటున్నారు. కేసు మొత్తం పీటముడి పడిపోయింది. తప్పంతా పోలీసులదే అంటుంటే వారంతా స్పందిస్తున్నారు. 10వేల వీడియోలను విశ్లేషించి కొన్ని వీడియోలను విడుదల చేసి తమ తప్పు లేదని నిరూపించుకుంటున్నారు.

బయట పడేసేది అతనేనా?
ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేసేది ఎవరు? అనే చర్చ నడుస్తోంది. కొందరు అభిమానులు పవన్ కల్యాణ్ పేరును సూచిస్తున్నారు. కానీ న్యాయబద్ధంగా ఉండే పవన్ కల్యాణ్ ఇటువంటి కేసుల నుంచి నిందితులుగా ఉన్నవారిని బయట పడేటయానికి ఒప్పుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందులోను ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో బన్నీ బయటకు వస్తే పవన్ కు చెడ్డపేరు వస్తుంది. అందుకే అతను కూడా సైలెంట్ గా ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+