Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కమల్ హాసన్‌కి ఆ విషయంలో భారీగా సపోర్ట్.. #IStandWithKamalHaasan ట్రెండింగ్

లోక నాయకుడు కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "థగ్ లైఫ్". గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 5, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కూడా నటించగా అభిరామి, త్రిష హీరోయిన్స్ గా నటించారు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన "నాయకుడు" మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ 38 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

'థగ్ లైఫ్' ఈవెంట్ లో తమిళ భాష నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కన్నడ సంఘాలు, అధికార విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (KFCC) కూడా తీవ్రంగా స్పందించాయి. ఈ క్రమంలోనే కమల్‌ సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తామని కేఫ్‌సీసీ హెచ్చరించింది. దీనిపై కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కమల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది.

istandwithkamalhaasan-is-trending-on-social-media

తప్పులకు మాత్రమే క్షమాపణలు చెబుతారు, అపార్థాలకు కాదు" అని కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ పరిణామాల నేపథ్యంలో 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేయనని కమల్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం 'థగ్ లైఫ్' సినిమాకు రూ. 12 నుంచి రూ. 15 కోట్ల ఆర్థిక నష్టం రావచ్చని వన్‌ఇండియా నివేదికలో పేర్కొంది. అయినప్పటికీ కమల్ హాసన్ తన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కానీ ఈ వ్యవహరంలో ఆయనకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు మాత్రం లభిస్తోంది.

సోషల్ మీడియా వేదికగా కమల్ కి మద్దతు తెలుపుతూ #IStandWithKamalHaasan అనే హ్యాష్‌ట్యాగ్ తో పోస్టులు పెడుతుండడంతో ట్రెండ్ అవుతోంది. అంతే కాకుండా కమల్ వ్యాఖ్యలు భాషా చరిత్ర ఆధారితమైనవే తప్ప కన్నడ భాషను అవమానించే ఉద్దేశ్యంతో చెప్పలేదని అభిమానులు అంటున్నారు. తమిళం ప్రపంచంలోని పురాతనమైన భాషలలో ఒకటిగా గుర్తింపు పొందిన భాష అని.. కన్నడతోనూ చారిత్రక, భాషాత్మక సంబంధాలున్నాయని పోస్టుల్లో రాసుకొస్తున్నారు.

కొందరు నెటిజన్లు అయితే ఏకంగా తమిళ పాఠ్యపుస్తకాల నుంచి సంబంధిత వివరాలను షేర్ చేస్తూ, కమల్ వ్యాఖ్యలు నిజాలు ఆధారంగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి సినిమా విడుదలకు ముందు ఇలా వివాదం తెరపైకి రావడం వల్ల సినిమాకి మరింత పబ్లిసిటీ దక్కుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+