జనసేన పొలిటికల్ యాడ్ ..ఇరగదీసిన గురూజీ
సినిమాలకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో.. పొలిటికల్ పార్టీలకు ఎన్నికల స్ట్రాటజీలు అంతే ముఖ్యం. గతంలో ఎన్నికల ప్రచారం పలు రకాలుగా ఉండేవి. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు దర్శనమిచ్చేవి. టీవీ ఛానళ్లు సైతం ప్రకటనలు కనిపించేవి. అయితే క్రమేపి ఇలాంటివి తగ్గుతూ వస్తున్నాయి.రాజకీయ పార్టీలు ట్రెండ్‌ను ఫాలో అవుతూ తమ పంథాను మార్చుకున్నట్టు కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియా వచ్చిన తరువాత రాజకీయ పార్టీలు కూడా వాటికే అధిక ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతున్నాయి.ఎన్నికల పార్టీలు సినిమాల రేంజ్‌లో పాటలను రూపొందిస్తున్నాయి. ఇక ఎన్నికల యాడ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే టీడీపీ , వైసీపీ ఎన్నికల యాడ్స్, పాటలకు సంబంధించిన వాటితో దూసుకుపోతుంటే .. జనసేన సైతం తాను అంటూ రంగంలోకి దిగింది. తాజాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తమ ఎన్నికల యాడ్‌ను విడుదల చేసింది.

జనసేన పార్టీ తమదైన శైలిలో ఈ వీడియోను రూపొందించింది. ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను.. 'గాజు గ్లాసు' తీసుకుందనే విషయాన్ని ఈ యాడ్‌లో చూపించారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను ఈ యాడ్‌లో చూపించే ప్రయత్నం చేశారు.అమరావతి, ఇసుక పాలసీ, రాష్ట్ర అభివృద్ధి.. ఇలా పేపర్ల పై రాసిఉంటాయి. వైసీపీ పాలనలో ఈ అంశాల్లో రాష్ట్ర అభివృద్ధి దారుణంగా దెబ్బతిందని ఈ వీడియో చూపించారు.
పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతూ.. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి.. చెల్లా చెదురుగా పడిపోయిన పేపర్లను ఒక్కొక్కటిగా తీసి టేబుల్ మీద సర్దుతారు. ఆపై ఆ పేపర్ల మీద గాజు గ్లాసు ఉంచుతారు. జగన్‌ను అధికారం నుంచి దూరం చేసి..రాష్ట్ర అభివృద్ధిని చక్కదిద్దుతామని విషయాన్ని చూపించే ప్రయత్నం చేశారు.
టేబుల్ మీద జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్‌తో పాటుగా టీడీపీ , బీజేపీ గుర్తులు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. అయితే ఈ వీడియోను పవన్ కల్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పర్యవేక్షణలో తీసినట్టు స్పష్టం అవుతుంది. ఆ యాడ్ థీమ్‌తో పాటు, దీనికి సంబంధించిన విషయాలు అన్నింటిని త్రివిక్రమే దగ్గరుండి చూసుకున్నారట.
అంతేకాకుండా ఈ యాడ్‌కు ఆయనే దర్శకత్వం వహించినట్టు సమాచారం.అందుకే ఈ యాడ్ అంత బాగా వచ్చిందని పవన్ అభిమానులు చెబుతున్నారు. ఈ యాడ్‌తో పాటు భవిష్యత్తులో జనసేన ఎన్నికల ప్రచారంలో కూడా త్రివిక్రమ్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications