శివాజీ సినిమాపై జూ.ఎన్టీఆర్ ప్రశంసలు.. ఓటీటీలో ఫుల్ ట్రెండింగ్ !!
మంచి సినిమాని ఆదరించే విషయంలో తెలుగు ప్రేక్షకుల ఎప్పుడూ ముందే ఉంటారు. నటీనటులు, భాష అనే విషయాలు ఎప్పుడు కూడా అడ్డుకావు అని నిరూపించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విజయ్ వంటి తమిళ స్టార్లకు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే స్టార్ క్యాస్ట్ లేకపోయినా, కేవలం కంటెంట్‌తోనే భారీ బ్లాక్‌బస్టర్లు అయిన ఉదాహరణలు టాలీవుడ్‌లో ఎన్నో ఉన్నాయి. అయితే... మంచి సినిమా అయినా కానీ అనుకోని కారణాల వల్ల ప్రేక్షకులకు పూర్తిగా చేరలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 'దండోరా'.
థియేటర్లలో తడబాటు..
శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'దండోరా'. గత ఏడాది విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కథ, సందేశం, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ ప్రశంసలు అందుకున్నాయి. కానీ సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ఓ వివాదం-హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు-సినిమాను మర్చిపోయేలా చేశాయి. ఆ వివాదం వల్ల అసలు సినిమాకు రావాల్సిన పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ జనాల్లోకి బలంగా వెళ్లలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల 'దండోరా' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. మూవీ బాగుండడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్వీట్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్ లోకి వచ్చింది. ఎన్టీఆర్ ట్వీట్‌లో.. 'దండోరా' మూవీ చూశాను. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవి కృష్ణ అద్భుతమైన నటన కనబర్చారు. ఇలాంటి గొప్ప సినిమా తీసిన దర్శకుడు మురళి కాంత్‌కు సెల్యూట్. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు." అని ప్రశంసించారు.
కాగా ఎన్టీఆర్ ప్రశంసలతో 'దండోరా' యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. దర్శకుడు మురళి కాంత్ స్పందిస్తూ.. ఎన్టీఆర్ అన్న నా సినిమా చూసి, నా పేరు పలికారు... ఇది చాలు అన్న. షివరింగ్ అవుతున్నా" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని కూడా "ఇది అసలైన విజయం అన్న. ఫ్యాన్‌బాయ్ మూమెంట్" అని రాసుకొచ్చారు.
Just watched #Dhandoraa. Deeply thought-provoking and powerful. Outstanding performances by Sivaji garu, Navdeep, Nandu, Ravi Krishna and Bindu Madhavi throughout…
— Jr NTR (@tarak9999) January 19, 2026
Hats off to director Murali Kanth garu for the strong writing and for executing such a rooted story so well.…
ట్రెండింగ్‌లో దండోరా..
మొత్తానికి ఎన్టీఆర్ ట్వీట్ ప్రభావంతో 'దండోరా' అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇండియాలో టాప్-2 స్థానంలో నిలిచి విశేష స్పందనను అందుకుంటోంది. థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా, డిజిటల్ వేదికపై ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది.
-
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications