'దేవర' సెన్సార్ రివ్యూ: పిచ్చెక్కించిన ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈనెల 27వ తేదీన విపరీతమైన అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా నిన్న విడుదలైంది. ట్రైలర్ ను విడుదల చేసి ప్రేక్షకుల్లో సినిమామీద తారస్థాయికి అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు.
క్లైమాక్స్ అదిరింది
తాజాగా ప్రొడక్షన్ టీం ఈ సినిమాను సెన్సార్ కు పంపించారు. సెన్సార్ సభ్యులు సినిమా మొత్తం మీద 10 షాట్స్ ను కట్ చేయమని చెప్పారు. దర్శకుడు, ఎడిటర్ వీటిని తొలగించిన తర్వాత దేవరకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు సమాచారం. సినిమాను చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం సినిమా క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉందని, సినిమాకే హైలైట్ గా నిలవబోతోందంటున్నారు. సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని, రెండు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ తన అభినయంతో ఆకట్టుకున్నారని చెప్పడంతో సినీ ప్రియులతోపాటు ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది.

మాస్ జాతరకు సిద్ధంగా ఉండండి
ఈనెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి త్వరలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి హృతిక్ రోషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం వార్2 చిత్రంలో హృతిక్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ స్నేహంతోనే హృతిక్ రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తేకానీ ఒక స్పష్టత రాదు. సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యుల ఇచ్చిన అభిప్రాయానికి, వారు ఇచ్చిన సర్టిఫికెట్ కు కొరటాల శివ చాలా ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ చేసే మాస్ జాతర చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా సిద్ధంగా ఉండాలని కొరటాల శివ అంటున్నారు.












Click it and Unblock the Notifications