'ఆచార్య'పై నిప్పు రాజేసిన 'దేవర'!... చిరు Vsఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటిస్తున్న దేవర చిత్రం ఈనెల 27వ తేదీన విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, కసితో చిత్రీకరించారు. షూటింగ్ జరిగే సమయంలో ఆయన పనితీరును గమనించినవారు కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలనే తపన కనపడిందంటున్నారు. ఆచార్యకు ముందు మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను లాంటి ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. ఒక్క ఆచార్య సినిమాతో ఇన్ని సంవత్సరాలుగా ఆయన పడిన కష్టమంతా వృథా అయింది.

కొరటాల శివపై గౌరవం పెరిగింది
ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబయిలో జరిగిన వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తన బుర్రలో ఎప్పుడూ సినిమా గురించి ఆలోచనలే ఉంటాయని, మొదటి నుంచి తాను ఆయనతో ప్రయాణం చేస్తున్నానని, ఈరోజు వరకు తనకు శివపై గౌరవం పెరిగిందేకానీ ఇసుమంత కూడా తగ్గలేదన్నారు. సినీ పరిశ్రమకు ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్ల వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూ మంచి సినిమాలు తీశాడన్నారు. సినిమాలోని సన్నివేశాలపై తన మైండ్ ను సరిగ్గా ఉపయోగించే వ్యక్తి అని కొనియాడారు. శివకు సరైన సమయం, సరైన మనుషులు పక్కన ఉంటే అతడు అద్భుతమైన సినిమాలను కచ్చితంగా అందిస్తాడని ఎన్టీఆర్ అన్నారు.

junior NTR expressed his opinion on director Koratala Siva and devara movie and indirect target aacharya movie

అది మార్చాలంటూ ఎవరూ ఒత్తిడి చేయలేదా?
ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడిన ఈ మాటల గురించే వివాదం రాజుకుంది. ఆచార్య సినిమా తీసినప్పుడు కొరటాల శివ పక్కన సరైన మనుషులు లేరా? సరైన సమయం కాదా? అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. దేవర సినిమా చేసే సమయంలో అందరూ కొరటాల శివకు మద్దతిచ్చారని, అది బాలేదని, ఇది బాలేదని, ఇది మార్చాలని, అది మార్చాలంటూ ఎవరూ దర్శకుడిపై ఒత్తిడి చేయలేదని, ఆచార్య సినిమా సమయంలో మాత్రం అది మార్చాలి.. ఇది మార్చాలంటూ ఆయనపై ఒత్తిడి చేశారంటూ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో మెగా అభిమానులకు, యంగ్ టైగర్ అభిమానులకు ప్రస్తుతం సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+