‘K-ర్యాంప్‌’ రివ్యూ : కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా..?

ఈ దీపావళి పండుగ సందడిలో థియేటర్లకు వచ్చిన నాలుగో చిత్రం 'కె-ర్యాంప్‌'. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై విడుదలైన ట్రైలర్‌, టీజర్లతోనే మంచి హైప్‌ క్రియేట్ అయింది. ప్రమోషన్స్ జోరు కూడా తోడవడంతో, ఈ రోజు (అక్టోబర్‌ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? కిరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.

కథ:
కుమార్‌ అబ్బవరం (కిరణ్‌ అబ్బవరం) కోటీశ్వరుడి కొడుకు. బాధ్యత లేకుండా చదువు మానేసి, రోజూ తాగుతూ చిల్లరగా గడుపుతుంటాడు. కొడుకును మార్చాలనుకున్న తండ్రి (సాయి కుమార్‌) జ్యోతిష్యుడి సలహాతో మెడిసిన్‌ చదివేందుకు కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఎంజాయ్‌ చేస్తున్న కుమార్‌, తన క్లాస్‌మేట్‌ మెర్సీ (యుక్తి తరేజా)ని చూసి ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా ప్రేమను అంగీకరించి, పెళ్లికి సిద్ధమవుతారు. అయితే, మెర్సీకి 'పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PSTD)' అనే అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది. ఈ వ్యాధి కారణంగా కుమార్‌కు ఎదురైన సమస్యలు, మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది, దానికి కుమార్‌ పరిష్కారం ఎలా చూపించాడు అనేదే మిగతా కథ. ఈ కథలో వీకే నరేశ్ పాత్ర కీలక మలుపు.

K-Ramp Review Did Kiran Abbavaram Score a Hit

విశ్లేషణ:
దర్శకుడు జైన్స్‌ నాని ముందుగా చెప్పినట్లుగానే ఇది పక్కా కామెడీతో కూడిన కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాలో కొత్తదనం లేదా లాజిక్‌లు వెతకడానికి ప్రయత్నించొద్దు. ప్రేక్షకుడికి కావాల్సిన 'ఊరమాస్ కామెడీ' సీన్లను, కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా పేర్చుకుంటూ పోయారు. రొటీన్‌గా అనిపించే కామెడీ కథకు, చివర్లో ఒక ఎమోషనల్ ముగింపు ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

హీరో ఎంట్రీ సీన్, రాజశేఖర్ పాటలకు కిరణ్ వేసే మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అంతా హీరో-హీరోయిన్ల ప్రేమకథతో రొటీన్‌గా నడుస్తుంది. కొన్ని మాస్ కామెడీ సన్నివేశాలు మాత్రమే ఫన్‌ను అందిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోవడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

ద్వితీయార్థం మెర్సీ ఆరోగ్య సమస్య నేపథ్యంలో జరిగే గందరగోళం, దాని వల్ల హీరో పడే ఇబ్బందులతో సాగుతుంది. ఈ క్రమంలోనే వెన్నెల కిశోర్‌, వీకే నరేశ్‌ పాత్రల ఎంట్రీతో నవ్వుల డోస్ మరింత పెరిగింది. వీరిద్దరి మధ్య వచ్చే సంభాషణలు, సన్నివేశాలు హాస్యాన్ని పంచుతాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు కథనం ఎమోషనల్‌గా మారుతుంది. నరేశ్‌ చెప్పే భావోద్వేగ డైలాగ్స్, సాయి కుమార్‌-కిరణ్‌ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను కదిలిస్తాయి. అయితే నరేశ్‌ పాత్రకు రాసిన కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. మొత్తంగా, నవ్వుల కోసం థియేటర్లకు వెళ్లేవారికి ఈ సినిమా మంచి ఎంపిక.

నటీనటుల ప్రదర్శన:
కిరణ్‌ అబ్బవరం ఈ సినిమాకు వన్‌ మ్యాన్‌ షో. యాక్షన్‌, ఫన్‌, ఎమోషనల్‌ సీన్లలో అద్భుతంగా నటించాడు. ఆయన కామెడీ టైమింగ్‌ సినిమాకు పెద్ద ప్లస్. అయితే, ఆయన పాత్ర కొన్నిచోట్ల పూరి జగన్నాథ్‌ హీరోలను గుర్తు చేస్తుంది.

యుక్తి తరేజా అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఫస్టాఫ్‌లో పెద్దగా స్కోప్ లేకున్నా, సెకండాఫ్‌లో తన నటనతో ఆకట్టుకుంది. కిరణ్‌-యుక్తి కెమిస్ట్రీ బాగా కుదిరింది.వీకే నరేశ్‌ పాత్ర సినిమాకు ప్రధాన బలం. ఆయన కనిపించిన ప్రతిసారీ నవ్వులు పూశాయి, అయితే ఆయనకు మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేది.వెన్నెల కిశోర్‌ అతిథి పాత్రలో మెరిసినా, ఆయన ఎపిసోడ్ హిలేరియస్‌గా ఉంది. సాయి కుమార్‌, మురళీధర్‌ గౌడ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ కేరళ అందాలను బాగా చూపించింది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

తీర్పు:
లాజిక్, కొత్తదనం ఆశించకుండా, ఊరమాస్‌ కామెడీతో, కిరణ్ అబ్బవరం స్టైల్‌లో హాయిగా నవ్వుకోవాలని కోరుకునే దీపావళి ప్రేక్షకులకు 'కె-ర్యాంప్‌' మంచి ఎంటర్‌టైనర్‌. కిరణ్‌ అబ్బవరం నటన, వెన్నెల కిశోర్‌, నరేశ్‌ల కామెడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

ఫైనల్ టాక్: నవ్వులు పంచుతుంది.

రేటింగ్:3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+