'యూఐ' రివ్యూ.. బొమ్మ బ్లాక్ బ్లాస్టర్

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దాదాపు పదేళ్ల తర్వాత నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'యూఐ'. గతంలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన నటించిన 'యూఐ' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఉపేంద్ర, రేష్మ హీరో హీరోయిన్లు. రవి శంకర్‌, సాధు కోకిల తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయడంతో 'యూఐ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

'పగలు, రాత్రి' సత్య(ఉపేంద్ర) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ సాగుతుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో తెరకెక్కించారు. హీరోగా, దర్శకుడుగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించారు. తన డిఫరెంట్ టేకింగ్‌తో వింటేజ్ ఉపేంద్రని గుర్తు చేశాడు. ప్రధమార్ధంలో వచ్చే హీరోయిన్‌తో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్రను గుర్తుకుతెచ్చాడు.ముఖ్యంగా ఇంట్వర్వెల్ బ్లాక్‌తో తన ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చేసాడు ఈ రియల్ స్టార్. ఇక సినిమాలో వచ్చే పాటలు సైతం సెటైరికల్‌గానే అనిపించాయి. ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా పాటలను సైతం రూపొందించారు.

Kannada hero Upendra UI review

సినిమాలోని ఓ ఎపిసోడ్ ప్రపంచంలో ఇంతవరకు ఏ దర్శకుడు కూడా ఇలా తీయాలనే ఆలోచన రాని విధంగా తెరకెక్కించారు ఉపేంద్ర. ఇది థియేటర్లలో చూస్తేనే మాజా వస్తోంది. డైరెక్టర్‌గాను ఉప్పి తన డిఫరెంట్ టేకింగ్‌తో పాత ఉపేంద్రని గుర్తుకు తెచ్చాడు.అన్ని ఒక ఎత్తు అయితే సినిమా క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్‌లు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు ఉపేంద్రకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మేకింగ్‌లో క్వాలిటీ తెర మీద కనిపిస్తోంది.

ఇంకా చెప్పాలంటే ఉపేంద్ర ఒన్ మ్యాన్ షోతో 'యూఐ' సినిమాను అదరగొట్టారు.సినిమా మొదలు నుంచి చివరి వరకు కథ మొత్తం కూడా ఉపేంద్ర చూట్టునే తిరుగుతోంది. ఉపేంద్ర దర్శకుడిగానే కాకుండా నటనతో కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. ప్రపంచం పేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్‌ను తెర మీద బలంగా చూపించడంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యారు. 'మీరు ఇంటిలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుండి బయటకి వెళ్ళండి' అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు ఉపేంద్ర సవాల్ విసిరారు. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తో హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్‌తో 'యూఐ' అదరగొట్టింది. ఇలాంటి కథలున్న సినిమాలు రావడం చాలా అరుదు, ఇంకా ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావడమే మహా అరుదు. కాబట్టి 'యూఐ' మూవీ ఈజ్ ఏ మస్ట్ ట్రై.

రేటింగ్
3.5/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+