కెజిఎఫ్ గర్ల్ అనిపించుకోవాలనుంది.. అంటోన్న కరీనాకపూర్...
బాలీవుడ్ నటి కరీనా కపూర్ కెజీఎఫ్ నటుడు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవకాశం వస్తే కెజిఎఫ్ నటుడు యష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని, అంతేకాకుండా తనను కేజీఎఫ్ గర్ల్ అని పిలిపించుకోవాలని ఉందంటూ తన మనసులోని మాటను ఓ టీవీ కార్యక్రమంలో బయటపెట్టింది బాలీవుడ్ నటి కరీనాకపూర్.
కాఫీ విత్ కరణ్ షో పాల్గొన్న కరీనా కపూర్: సుమారు ఇరవై ఏళ్లుగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది బాలీవుడ్ నటి కరీనాకపూర్. ఈ ఏజ్‌లో కూడా వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ఇద్దరు పిల్లల తల్లయిన తర్వాత కూడా తరగని అందంతో ప్రేక్షకులను తనవైపు ఆకట్టుకుంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. కరీనాకపూర్ తాజాగా కరణ్‌జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ షోలో కరీనాకపూర్, ఆలీయా భట్‌తో కలిసి సందడిచేశారు.

యష్‌తో నటించాలనుంది: అయితే, ఈ షోలో భాగంగా కరణ్ కరీనాకపూర్‌ను కొన్ని ప్రశ్నలను అడిగారు. అందులో కొన్నింటికి సమాధానం ఇచ్చింది. మరికొన్నింటి ప్రశ్నలను వదిలేసింది. అందులో అడిగిన ప్రశ్నలో... సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నావు? అని కరణ్ అడిగిన ప్రశ్నకు కరీనా కపూర్ యశ్ అంటూ సమాధానం చెప్పింది.
కెజిఎఫ్ నటుడు యష్ నటన తనకు ఎంతో బాగా నచ్చుతుందని, తను నటించిన కేజీఎఫ్ సినిమా ఎంతో బాగా నచ్చిందని కరీనాకపూర్ వెల్లడించింది. అవకాశం వస్తే యష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ ఈ సందర్భంగా వివరించింది. అంతేకాదు తనను కేజీఎఫ్ గర్ల్ అని పిలిపించుకోవాలని ఉందని తన మనసులోని మాటను ఇలా బయటపెట్టేసింది ఈ బ్యూటీ.

సారా అలీఖాన్‌కు తల్లిగా నటిస్తారా...?: దీంతో పాటు..మరో ప్రశ్నను కూడా అడిగాడు కరణ్. సారా అలీఖాన్ కు తల్లిగా నటించే ఛాన్స్ వస్తే చేస్తావా అని కరణ్ ప్రశ్నించగా, తప్పకుండా చేస్తానని కరీనా చెప్పింది. తాను ఒక నటినని, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పింది. సారా అలీఖాన్ ఎవరో కాదు. కరీనాకపూర్ భర్త సైఫ్ ఆలీఖాన్ మొదటి భార్య కూతురు. అందుకే కరణ్ ఈ ప్రశ్నను లేవనెత్తాడు.
-
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications