Karthika deepam 2 September 11 Episode: కార్తీక్ బాబు ట్విస్ట్..కాశీని ఇరికించేందుకు మాస్టర్ ప్లాన్..!!
కార్తీక దీపం సీరియల్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.459వ ఎపిసోడ్ రివైండ్ చేస్తే... కాశీ కారు ప్రమాదం జరిగిందని స్వప్న ఇంటికి వచ్చి కంగారుగా చెబుతుంది. పోలీసులు కాశీని తీసుకువెళ్లారని, గాయపడిన వ్యక్తి చనిపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. శ్రీధర్, కావేరి షాక్ అవుతారు. శ్రీధర్ మౌనంగా ఉండటంతో,స్వప్న"ఈ సమయం కోసమే ఆయన ఎదురుచూశారు,నా భవిష్యత్తు నాశనం కావాలని అనుకుంటున్నారు" అని నిందలు వేస్తుంది. శ్రీధర్ మౌనాన్ని వీడి, తాను చూసుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు.
మరోవైపు, సుమిత్ర జ్యోత్స్నకు జీవితంలో నమ్మకం కోల్పోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. "నువ్వు చిన్నప్పుడు కమలం పువ్వు కోసం కార్తీక్‌ను కోనేటిలోకి నెట్టి ప్రమాదంలో పడేశావు. అప్పుడు ఒక చిన్నారి కాపాడకపోతే నాపై నింద ఉండేది" అని చెబుతుంది. దానికి కార్తీక్ బాబు "నా ప్రాణదాతెవరో నాకు తెలిసిపోయింది" అని చెప్పడంతో సుమిత్ర సంతోషిస్తుంది. అయితే ఆమె తన గల్లీలోనే ఉంటుందని కార్తీక్ చెప్పినా, కాంచనను కలవాల్సి వస్తుందన్న కారణంతో సుమిత్ర వెళ్లనంటుంది.

సెప్టెంబర్ 11, ఎపిసోడ్ 460:
కార్తీక్ బాబు ఇచ్చిన ట్విస్ట్‌కు జ్యోత్స్న ఆశ్చర్యపోతుంది. కార్తీక్ రోజురోజుకూ అమ్మకు దగ్గరవుతున్నాడని, చివరికి దీపానే ఆమె కూతురని చెప్పినా సుమిత్ర నమ్ముతుందని జ్యోత్స్న భయపడుతుంది. మరోపక్క, సుమిత్ర, దశరథలు మాట్లాడుకోవడం లేదని బాధపడిన దశరథ, "నేను చేసిన తప్పు వల్ల నా చెల్లి కాంచన దగ్గర తల దించుకోవాల్సి వస్తుంది" అని శివ నారాయణతో అంటాడు. శివ నారాయణ వారిద్దరినీ కలిసి ఉండమని సలహా ఇస్తాడు.
ఇదే సమయంలో, ఇంటికి తిరిగి వచ్చిన కార్తీక్, దీపాలు తమ కూతురు శౌర్యకు పుట్టినరోజు సర్ప్రైజ్ ఇస్తారు. తన పుట్టినరోజు ఎవరూ గుర్తుంచుకోలేదని కోపంగా ఉన్న శౌర్య, కాంచన, అనసూయ, కార్తీక్, దీపాలు ఇచ్చిన బహుమతులు, వంటకాలతో సంతోషపడుతుంది.
అంతలోనే, పారుజాతం కొడుకు దాసు జ్యోత్స్నకు ఫోన్ చేసి, కాశీకి యాక్సిడెంట్ అయి పోలీసు స్టేషన్‌లో ఉన్నాడని, అతడిని కాపాడమని వేడుకుంటాడు. అయితే గతంలో గౌతమ్ విషయంలో కాశీ తనకు సాయం చేయనందుకు అతడిపై పగ తీర్చుకోవాలని జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. ప్రమాదానికి గురైన వ్యక్తిని చంపేసి, కాశీ జీవితాంతం జైలులోనే ఉండేలా చేస్తానని జ్యోత్స్న మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.












Click it and Unblock the Notifications