Karthika deepam 2 September 4th Episode: కార్తీక్ బాబుకు తన తల్లి ఇచ్చిన షాక్ ఏంటి..?
కార్తీక దీపం 2 సెప్టెంబర్ 3న 453వ ఎపిసోడ్‌తో ఉత్కంఠగా సాగింది. సుమిత్ర ఇంటికి తిరిగి రాగానే శివ నారాయణ, దశరథ ఆమెను నిలదీశారు. ఆమె చర్యలపై ప్రశ్నలు సంధించగా, సుమిత్ర తన తప్పేమిటని ఎదురు ప్రశ్నించింది. దీపా చేసిన పని తన మనసును బాధించిందని, అందుకే తాను అలా చేశానని పేర్కొంది. అయితే, దశరథ ఇది పెద్ద తప్పు అని సుమిత్రను మందలించాడు.
శివ నారాయణ కూడా కార్తీక్, దీపాల వివాహానికి ముందు అందరి అభిప్రాయాలు తీసుకున్నానని, అప్పుడే చెప్పకుండా ఇప్పుడు బాధపెట్టడం ఎందుకని ప్రశ్నించాడు. ఈ వాదనలో జ్యోత్స్న జోక్యం చేసుకుని, తన తల్లిని అనవసరంగా నిందిస్తున్నారని ఆరోపించింది. అనాథ అయిన దీప కోసం కాంచన అత్త తమను కాదని వెళ్ళిపోయి, తన తాత పరువును పణంగా పెట్టిందని జ్యోత్స్న గుర్తు చేసింది. ఇప్పుడు తమ తల్లికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. జ్యోత్స్న మాటలకు దశరథ కోపగించుకున్నా, సుమిత్ర అడ్డుకుంది.

సెప్టెంబర్ 4న ప్రసారమైన 454వ ఎపిసోడ్‌లో,శివ నారాయణ కార్తీక్ బాబుతో కలిసి కారులో బయలుదేరాడు.చాలా దూరం ప్రయాణించినా,శివ నారాయణ మౌనంగానే ఉన్నాడు.దీనితో కార్తీక్ బాబు "పెద్దసార్,ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా ఇలా ఉండటం ఏమిటి?" అని అడిగాడు. శివ నారాయణ "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని ప్రశ్నించగా, కార్తీక్ "పెట్రోల్ కొట్టించడానికి" అని సమాధానం ఇచ్చాడు. తాను కూడా అక్కడికే వస్తున్నానని శివ నారాయణ బదులిచ్చాడు.
కార్తీక్ "మా డ్రైవర్లపై మీకు నమ్మకం లేదా సార్?" అని అడగ్గా, శివ నారాయణ "నమ్మకస్తులైన వారినే డ్రైవర్లుగా పెట్టుకుంటాం" అని అన్నాడు. కార్తీక్ "అయితే మా వెనకాల ఎందుకు వస్తున్నారు?" అని ప్రశ్నించగా, శివ నారాయణ కోపంతో "ముందు కారు ఆపు!" అన్నాడు. "నేను ఎందుకు మౌనంగా ఉన్నానో, ఎందుకు చిరాకు పడుతున్నానో నీకు తెలియదా?" అని నిలదీశాడు. కార్తీక్ కారు ఆపగానే, ఇద్దరూ దిగారు. శివ నారాయణ "మీ అమ్మ ఏమంటుందిరా?" అని అడిగాడు. సుమిత్ర కార్తీక్, దీపాల పెళ్లిలో తాళి దొంగిలించిందని తెలిసిన తర్వాత, తమ ఇంట్లో కనీసం క్షమాపణలు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని, దీనికి దీపా ఎలా స్పందించిందో తెలుసుకోవాలనుకున్నాడు.
కార్తీక్ "మీ మీద మా అమ్మకు చాలా కోపంగా ఉంది" అని బదులిచ్చాడు.వెంటనే తన తల్లి కాంచనకు ఫోన్ చేసి,తాత ముందే మాట్లాడాడు."అమ్మా, నీకు మీ పుట్టింటి వాళ్ల మీద కోపం తగ్గిపోయింది కదా?" అని అడిగాడు. కాంచన "నువ్వే మరిచిపోమని చెప్పి మళ్లీ గుర్తు చేస్తావేంటిరా? వాళ్ల మీద నా కోపం తగ్గలేదు" అని సమాధానం ఇచ్చింది. "చేసిందంతా సుమిత్ర కదా, తాత మీద ఏం కోపం లేదు కదా అమ్మా?" అని కార్తీక్ అడిగాడు. కాంచన "మా నాన్నే అన్నిటికీ కారణం, ఆయన పోకడలే ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చాయి" అని మండిపడి, వెంటనే ఫోన్ కట్ చేసింది. కాంచన కోపం తగ్గలేదని గ్రహించిన శివ నారాయణ బాధపడ్డాడు.
మరోవైపు, శ్రీధర్ కావేరితో ఘర్షణ పడుతున్నాడు. దీపా, కార్తీక్ బాబుల పెళ్లికి తాను రాకుండా ఉండాల్సిందని, అక్కడ తనకు ఎలాంటి గౌరవం దక్కలేదని అన్నాడు. ఏదో ఒక రోజు దీపాను కార్తీక్ బాబు నుంచి విడదీస్తానని శపథం చేశాడు. కావేరి అలా చేయొద్దని చెప్పింది. సరిగ్గా అదే సమయంలో దాసు ఇంటికి వచ్చాడు. తాను శ్రీశైలం వెళ్తున్నానని, కార్తీక్, దీపాల పెళ్లి జరిగినందుకు మొక్కు తీర్చుకుంటానని చెప్పాడు. కావేరి అక్క ముడుపు ఇస్తానంటే వచ్చానని అన్నాడు. శ్రీధర్ ఆ మొక్కు ఏమిటని కావేరిని ప్రశ్నించగా, ఆమె కార్తీక్, దీపాలకు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నానని బదులిచ్చింది. ఈ మాటలు విని శ్రీధర్ షాక్ అయ్యాడు.
దాసు "కాశీ, దీపా గురించి మీకు పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నారు బావ. ఏదో ఒక రోజు దీపాను నెత్తిన పెట్టుకుంటారు" అని మనసులో అనుకున్నాడు. శ్రీధర్‌కు "నువ్వు చూస్తున్నవన్నీ నిజాలు కావు, ఏదో ఒక సందర్భంలో నీ కళ్లు తెరుచుకుంటాయి" అని చెప్పాడు. దశరథ సుమిత్రను ప్రశ్నిస్తూ, ఆమె చేసిన పనికి తన చెల్లి కాంచన అక్కడ ఏడుస్తూ ఉందని అన్నాడు. వెళ్లి కాంచనకు క్షమాపణలు చెప్పమని దశరథ సుమిత్రను కోరగా, ఆమె నిరాకరించింది. పైగా, జ్యోత్స్న సుమిత్రకు మద్దతుగా నిలిచింది. తన తల్లి క్షమాపణ చెప్పదని, ఆ అనాథ దీప కోసం తండ్రి ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడని ప్రశ్నించింది.
దీపా వీరి మాటలన్నీ వింటూ ఉంది. దశరథ సుమిత్రపై కోపంగానే ఉండి, "నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే" అన్నాడు. ఎలాగైనా కాంచనకు క్షమాపణలు చెప్పమని, లేకపోతే తాను కూడా ఆమెతో మాట్లాడనని, జీవితాంతం క్షమించనని చెప్పాడు. అదే సమయంలో దీపా కాఫీ తీసుకొచ్చింది. జ్యోత్స్న దీపాను "నీ వల్లే అన్ని సమస్యలు వచ్చాయి" అంటూ ఇంటిలోంచి మెడ పట్టుకుని బయటికి నెట్టివేసింది. సుమిత్ర కూడా "దీపాతోనే అన్ని దరిద్రాలు" అని మండిపడింది. మరోసారి పారు దీపాను నెట్టివేయగా, సరిగ్గా అప్పుడే కార్తీక్ బాబు, శివ నారాయణ తిరిగి ఇంటికి వచ్చారు. దీపాను పారు నెట్టివేయడంతో కార్తీక్ బాబు వెళ్లి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications