నాని 'ది ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ మ్యాజిక్.. సోషల్ మీడియాలో వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ సినిమా 'ది ప్యారడైజ్' థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభమైన ఈ సినిమా.. గురువారం ఉదయం నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాలో నాని యాక్షన్, తల్లి సెంటిమెంట్, పవర్ఫుల్ ఫైట్స్ సీన్స్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ క్యారెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి పోషించిన 'ఎమ్మెల్యే శంకరన్న' క్యారెక్టర్ అచ్చం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలి ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రియదర్శి మాట్లాడే తెలంగాణ యాస, ఆయన బాడీ లాంగ్వేజ్, లుక్ కేసీఆర్ స్టైల్లోనే డిజైన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో శ్రీకాంత్ ఓదెల ఈ పాత్రను కేసీఆర్ రిఫరెన్స్ తోనే రూపొందించారని నెటిజన్లు భావిస్తూ.. దానికి సంబంధించిన క్లిప్పులను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

తెలంగాణలోని గోదావరిఖని నేపథ్యంగా సాగే ఈ కథలో ప్రియదర్శి పోషించిన శంకర్ అన్న పాత్ర కథను మలుపు తిప్పే కీలకమైన ఘట్టాల్లో ఒకటిగా నిలుస్తుంది. కేవలం కేసీఆర్ రిఫరెన్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే దివంగత నేత ఎన్టీఆర్ పాత్ర రిఫరెన్సులు కూడా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కథలో తెలంగాణ ప్రాంతీయ మూలాలు, రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ పాత్రలను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. యాక్షన్ సీన్లతో పాటు తెలంగాణ యాసను ప్రతిబింబించే డైలాగ్స్, పొలిటికల్ రిఫరెన్సులు ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
#TheParadise సినిమాలో కేసీఆర్ రోల్..! థియేటర్స్ లో విజిల్స్..
— Telugu Reporter (@TeluguReporter_) September 24, 2026
1980ల్లో ప్యారడైజ్ ప్రాంతంలో జరిగే కల్పిత కథతో 'ప్యారడైజ్' సినిమా తీశారు. ఇందులో గుర్తింపు కోసం పోరాడే సవారీ తెగకు అండగా నిలబడే ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి నటించాడు. అయితే, ఈ పాత్రని చూస్తున్నంతసేపు తెలంగాణ మాజీ… pic.twitter.com/OWc0vq0tJ6














Click it and Unblock the Notifications
