కీర్తి సురేశ్ ఇంట్లో కుక్కగా పుట్టిన బాగుండేది..!
హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేశ్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేశ్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకున్నారు.ఇటీవల కాలంలో కీర్తి సురేశ్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ కీర్తి సురేశ్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

నేటి తరంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్, ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది. కీర్తి సురేశ్రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కీర్తి సురేశ్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా ఇచ్చింది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక గతేడాది కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల తన ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ ప్రైజ్ ఇచ్చింది.
కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేశ్.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేశ్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆప్డేట్స్ ఇస్తుంటుంది.
కీర్తి సురేశ్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో కీర్తి జిమ్ చేస్తుండగా, తాను ప్రేమగా పెంచుకునే కుక్క పిల్ల ఆమెను డిస్టర్బ్ చేసింది. కీర్తి మొహంపైకి వెళ్లి ఆమెతో ఆడుకుంది.కీర్తికి తెగ ముద్దులు పెడుతూ..అల్లరి చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కీర్తి. ఈ వీడియో నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. కీర్తి సురేశ్ ఇంట్లో కుక్కగా పుట్టిన బాగుండేదని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఆ కుక్క ఎంత అదృష్టం చేసుకుందో అంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. ఇలా తమదైనశైలిలో కీర్తి సురేశ్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications