పెళ్లైన పది రోజులకే షాకిచ్చిన కీర్తి సురేష్..!

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12న(గురువారం) అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.

Keerthy Suresh post wedding look is now viral

గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, తర్వాత తన భర్త ఆంటోని సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా భర్తకు లిప్‌లాక్‌ ఇచ్చింది. కీర్తి సురేష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Keerthy Suresh post wedding look is now viral

ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది. ఈ ఏడాది కీర్తి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించింది. పెళ్లికి ముందే షూటింగ్ పూర్తి చేసిన కీర్తి , పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది.'బేబి జాన్' ప్రమోష‌న్స్ కోసం కీర్తి ముంబైలో అడుగుపెట్టింది. కాళ్ల‌కు పారాణి అయినా ఆర‌కుండానే కీర్తి ముంబైలో ప్రమోష‌న్స్‌కు అటెండ్ అయింది.మోడ్ర‌న్ డ్రెస్ లో క‌నిపించిన కీర్తి త‌న తాళిబొట్టును ప్ర‌ద‌ర్శించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది.

ఇదే సమయంలో థైస్ షోతో అక్కడున్న వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కీర్తి సురేష్ మోడ్ర‌న్ అమ్మాయే అయినా ఇలా తాళిబొట్టును గౌర‌వించ‌డాన్ని చాలామంది ప్ర‌శంసిస్తున్నారు. సాంప్ర‌దాయాన్ని, భ‌ర్త‌ను గౌర‌వించే మ‌హిళ అంటూ కీర్తి సురేష్‌పై పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. అయితే మరి కొందరు కీర్తి వేసుకున్న డ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లై 10 రోజులు కూడా కాకుండానే ఇలాంటి డ్రెస్‌తో దర్శనం ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కనిపించిన లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+