"అవి వణుకుతున్నాయ్".. ఆ బూతులు, ముద్దులు ఏంది అన్నా !!

టాలీవుడ్‌లో షార్ట్ ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ నుంచి హీరోగా వచ్చిన వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే 'క 'చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. అయితే దానికి తర్వాత వచ్చిన 'దిల్ రూబా' మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఒక సాలిడ్ హిట్ కోసం కిరణ్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "K-ర్యాంప్". ఈ చిత్రంతోనే జైన్స్ నాని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ చూసే యూత్ ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుండగా.. అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

kiran-abbavaram-k-ramp-movie-teaser-filled-with-bold-scenes-and-liplocks

అయితే ఈ టీజర్ మొత్తం బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్‌తో నింపేసినట్టు కనబడుతుంది. హీరో ఎంట్రీలోనే "నా ల..వడలో గేమ్ ఆడురా" అంటూ డైలాగ్ చెప్పడం షాకింగ్‌ అనిపిస్తుంది. అలానే కాలేజీ సన్నివేశంలో "నా వెంట్రుకలు లేచి నిల్చున్నాయి సార్" అని చెప్పగా.. ఆయన తండ్రి పాత్రలో నటిస్తున్న సాయి కుమార్ "నాది కూడా సేమ్ ఫీలింగ్ సార్" అని చెప్పి కామెడీ చేస్తారు.

అటు హీరోయిన్‌తో బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి. చివర్లో వెన్నెల కిషోర్‌తో సీన్‌లో కిరణ్ "ముద్దు పెడితే ఒక చోట ఫీలింగ్స్ వస్తాయి కదా.. అవి వణుకుతున్నాయ్ రా" అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

మరోవైపు కిరణ్, 2019లో "రాజావారు రాణిగారు" చిత్రంలో తన సరసన నటించిన నటి రహస్యతో ఇతను ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమించుకున్న తర్వాత 2024 ఆగస్టు 22న వీరిద్ధరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రీసెంట్ గానే ఈ దంపతులు పండంటి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో శిశువు పాదాన్ని ముద్దు పెడుతూ కనిపించారు కిరణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+