ఈ హీరోయిన్ ఏంట్రా అచ్చం రష్మికలా ఉంది..!
టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త ప్రతిభను సాదరంగా ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా కథానాయికల విషయంలో టాలీవుడ్ ఎంపిక ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇటీవల కాయదు లోహర్ వంటి పరభాషా భామలు తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకోగా.. ఇప్పుడు అదే బాటలో అస్సాం నుంచి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సరికొత్త అందం 'భైరవి'. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం 'కొత్త మలుపు'. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్లతో భైరవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనతోనూ మెప్పించగలననే నమ్మకాన్ని కలిగిస్తూ టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోయిన్‌గా అడుగుపెడుతోంది.
'కొత్త మలుపు' ట్రైలర్‌లో భైరవి క్యూట్ లుక్స్, స్క్రీన్‌పై కనిపించిన కాన్ఫిడెన్స్, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సోషల్ మీడియాలో అయితే ఈమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా భైరవి నవ్వు, ఆమె ఫేస్ కట్ చూసిన కొందరు నెటిజన్లు.. టాలీవుడ్ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్నాతో పోలుస్తున్నారు. అచ్చం రష్మికలాగే చాలా క్యూట్‌గా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. లవ్లీ లుక్స్‌తో ఇప్పటికే కుర్రకారు గుండెల్లో చేరిపోయిన ఈ అస్సాం బ్యూటీ, టాలీవుడ్ నెక్స్ట్ క్రష్‌గా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గ్లామర్ డాల్‌గా మాత్రమే మిగిలిపోకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను కూడా అలవోకగా చేయగలనని భైరవి ట్రైలర్‌లోనే నిరూపించింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె పలికించిన హావభావాలు, నటనలోని ఈజ్ చూస్తుంటే.. బ్యూటీ విత్ పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ దొరికిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలయ్యాక భైరవి నటనకు మరిన్ని మార్కులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
సాధారణంగా పరభాషా హీరోయిన్లు తెలుగులో మాట్లాడటానికి కాస్త తడబడుతుంటారు. కానీ, భైరవి మాత్రం 'కొత్త మలుపు' ప్రమోషనల్ ఈవెంట్లలో చక్కగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించి అందరి హృదయాలను గెలుచుకుంది. కొత్త భాష అయినా సరే, నేర్చుకుని మరీ ఇక్కడి ప్రేక్షకులతో వారి మాతృభాషలో కనెక్ట్ అవ్వాలని ఆమె చూపించిన ఆసక్తిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విపరీతంగా అభినందిస్తున్నారు. ఈ ఒక్క క్వాలిటీ ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.
భైరవి హీరోయిన్‌గా వస్తున్న 'కొత్త మలుపు' చిత్రం జూన్ 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. టీజర్, ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ సాయంతో సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను, ఇటు యూత్‌ను సమానంగా ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.టీజర్, ట్రైలర్లతోనే ఫుల్ మార్కులు కొట్టేసిన భైరవి.. జూన్ 12న థియేటర్లలో కూడా తన నటనతో మాయ చేస్తే, టాలీవుడ్‌కి మరో స్టార్ హీరోయిన్ దొరికినట్లే.













Click it and Unblock the Notifications