అదరగొట్టిన థ్రిల్లర్ డ్రామా.. అసలు మిస్ అవొద్దు

రానా దగ్గుబాటి సమర్పణలో, 'కేరాఫ్ కంచరపాలెం' నటి ప్రవీణ పరుచూరి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం 'కొత్తపల్లిలో ఒకప్పుడు' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ విలేజ్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:
కథ 1997లో కొత్తపల్లి అనే కుగ్రామంలో మొదలవుతుంది. ఊరి ప్రజలను వడ్డీలతో పీడించే అప్పన్న (రవీంద్ర విజయ్) చుట్టూ తిరుగుతుంది. అతని దగ్గర పనిచేసే రామకృష్ణ (మనోజ్ చంద్ర) జమీందార్ రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక)ని చిన్నతనం నుంచీ ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమను చెప్పే క్రమంలోనే అతనికి మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఇంతలో అప్పన్న ఆకస్మిక మరణం ఊరిలో ఎలాంటి మార్పులు తెచ్చింది? రామకృష్ణ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అప్పన్న అంటే భయం కాస్తా భక్తిగా ఎలా మారింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

kothapallilo okappudu movie review

ప్లస్ పాయింట్స్:
'కేరాఫ్ కంచరపాలెం' మేకర్స్ నుండి వచ్చిన సినిమా కాబట్టి సహజత్వంపై అంచనాలు సహజం. ఈ సినిమా కొంతవరకు వాటిని అందుకుంది. ముఖ్యంగా విజువల్స్, సంభాషణల్లో సహజత్వం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా మొదలైనా, తర్వాత కామెడీ సీన్స్, థ్రిల్ మూమెంట్స్‌తో పుంజుకుంటుంది. కొన్ని సన్నివేశాలు హిలేరియస్‌గా నవ్విస్తాయి.

దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్, థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి. కొత్త నటీనటుల నటన ఈ సినిమాకు ప్రధాన బలం. హీరో మనోజ్ చంద్ర ఉత్తరాంధ్ర మాండలీకంలో, మంచి బాడీ లాంగ్వేజ్‌తో, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మౌనిక తన పాత్రకు తగిన సహజ నటనను కనబరిచింది. ఉషా బోనెలా కామెడీ టైమింగ్, ముఖ్యంగా హీరోతో ఆమె సన్నివేశాలు ఫన్ క్రియేట్ చేశాయి. రవీంద్ర విజయ్ అప్పన్నగా తన మార్క్ నటన, సహజమైన మాడ్యులేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. బెనర్జీ, బాబు మోహన్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్
సినిమాలో ఎంచుకున్న థీమ్ బాగున్నా, అది సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. సినిమా మొదట్లోనే "మనం వస్తువులను ఉన్నట్టుగా చూడము, మనం ఎలా అనుకుంటున్నామో అలా చూస్తాము" అనే కొటేషన్ ఉన్నప్పటికీ, దాన్ని అర్థం చేసుకోకుండా సినిమా చూస్తే కథనం ఒకింత సిల్లీగా అనిపించవచ్చు. అప్పన్న బండిపై చూపించే సన్నివేశాలు, ఊరి ప్రజల ఆకస్మిక మార్పు, మూఢ నమ్మకాలు అతిగా, ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి.రవీంద్ర విజయ్ పాత్రను ఇంకొంచెం పెంచి, అతని రోల్ ముగింపును మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం: సంగీతం బాగుంది, కెమెరా పనితనం మెప్పిస్తుంది.నిర్మాణ విలువలు ఓకే స్థాయిలో ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేదు. మణిశర్మ అందించిన పాటలు, వరుణ్ ఉన్ని నేపథ్య సంగీతం బాగున్నాయి. పెట్రోస్ అంటోనియాడిస్ కెమెరా వర్క్ బాగుంది, చక్కటి విజువల్స్‌ని అందించింది. ఎడిటింగ్ ఓకే అయినా, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సింది. డబ్బింగ్ సహజత్వాన్ని పెంచింది.

దర్శకురాలు ప్రవీణ పరుచూరి ఒక బ్యూటిఫుల్ లైన్ ని ఎంచుకున్నారు. తాను అనుకున్న పాయింట్ ని ఎమోషనల్, ఫన్ మిళితంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల సహజత్వం లోపించింది. కథనాన్ని ఇంకొంచెం మెరుగ్గా డిజైన్ చేసి ఉంటే సినిమా మరింత ఆకట్టుకుని ఉండేది. ఓవరాల్‌గా ఆమె పనితీరు ఓకే అని చెప్పొచ్చు.

ఫైనల్‌:
మొత్తంగా, "కొత్తపల్లిలో ఒకప్పుడు" సినిమా కొన్ని చోట్ల మెప్పించే విలేజ్ కామెడీ, థ్రిల్లర్ డ్రామా. ప్రధాన నటీనటుల నటన ఆకట్టుకుంటుంది. కథా నేపథ్యం, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. అయితే, కొన్ని సన్నివేశాలు సిల్లీగా అనిపించడం, సహజత్వం లోపించడం వంటివి మైనస్ పాయింట్స్. తక్కువ అంచనాలతో వీకెండ్‌లో ఒకసారి చూడదగిన సినిమా ఇది.

రేటింగ్:3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+