బిగ్ బాస్ హౌస్ మూసివేత.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

బిగ్ బాస్ కన్నడ స్టూడియోను తక్షణమే మూసివేయాలని కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB) ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, కాలుష్య నియంత్రణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సౌత్ రామనగర జిల్లా, బిడాదిలోని 'జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్' ప్రాంగణంలో ప్రస్తుతం ఈ షో చిత్రీకరణ జరుగుతోంది.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' బిగ్ షాక్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. తమ అనుమతి లేకుండా చిత్రీకరణ నిర్వహించడంతోపాటు.. పర్యావరణంలోకి కలుషిత నీటిని విడుదల చేస్తుందన్న కారణంతో కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే బిగ్ బాస్ కన్నడ స్టూడియోను మూసివేయాలని కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేయాలని రామనగర డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని బెస్కామ్‌ కు ఆదేశాలు ఇచ్చింది.

రూ. 300 కోట్ల బిజినెస్ ఉన్న కన్నడ బిగ్ బాస్ షోకు బిగ్ షాక్ తగిలినట్లుగా చెప్పవచ్చు. డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరినీ వేరే చోటుకు షిఫ్ట్ చేశారు. బిగ్ బాస్ కన్నడ హౌస్ ను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గేట్లు మూసేశారు. బిగ్ బాస్ నిర్వాహకులకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే యోచనలో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

KSPCB Shuts Down Bigg Boss Kannada Studio Over Environmental Violations

అయితే మీడియాను డైవర్ట్ చేసేందుకు బిగ్ బాస్ టీమ్ వ్యవహరిస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి కార్లు బెంగళురు, చెన్నపట్నం కు వెళ్తున్నాయి. మీడియాకు రెస్పాండ్ అవ్వడం లేదు. మీడియాను మిస్ లీడ్ చేసేందుకు బిగ్ బాస్ హౌస్ నుంచి పలు దిశల్లో కార్లు వెళ్తున్నాయి. ఇక ఈ పరిణామంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పలుమార్లు నోటీసులు జారీ చేసినా బిగ్ బాస్ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+