ఐ బొమ్మలోకి దూసుకొచ్చిన సూపర్ హిట్ సినిమాలు..!
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది.
ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో సూపర్ హిట్ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ఐ బొమ్మలో ప్రత్యక్షం అయింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలిసారి 100 కోట్లు సాధించిన సినిమాగా 'ఓజీ' నిలిచింది. అలాగే విజయ్ ఆంటోని నటించిన 'భద్రకాళి' సినిమా సైతం ఐ బొమ్మలో స్ట్రీమింగ్ అవుతోంది. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా 'కిష్కింధపురి' ఐ బొమ్మలోకి వచ్చేసింది. హార్రర్,సస్పెన్స్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ఈ సినిమా కూడా ఐ బొమ్మలో అందుబాటులో ఉంది. మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'టన్నెల్', 'అర్జున్ చక్రవర్తి', 'థాంక్యూ డియర్' వంటి సినిమాలు ఐ బొమ్మలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
గమనిక: ఐ బొమ్మకు వన్ ఇండియా తెలుగు వెబ్‌సైట్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఐ బొమ్మను ఏ విధం గాను వన్ ఇండియా తెలుగు వెబ్‌సైట్ ప్రోత్సహించడం లేదు. కేవలం ఐ బొమ్మలో వచ్చే ఆప్‌డేట్స్‌ను మాత్రమే అందించడం జరుగుతోంది.












Click it and Unblock the Notifications