హీరో రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్
హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది.
ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది.

లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.
ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే పోలీసులు ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్‌లో నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు వెంటనే సమర్పించాలని పోలీసులు ఆమెకు తెలిపారు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అయితే లావణ్య కనిపించడం లేదనే సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్? -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?












Click it and Unblock the Notifications