ఆస్కార్ రేసులో మరో ముందడుగు.. కాంతార, మహావతార్ నరసింహ సాధించేనా ??
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో హోంబలే ఫిల్మ్స్ మరో కీలక ముందడుగు వేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల రేసులో ఈ ఏడాది హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన రెండు సినిమాలు పోటీపడనున్నాయి. కాంతార: చాప్టర్-1, మహావతార్ నరసింహ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్ పోటీలో నిలవగా.. ఇపుడు మరో ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు జనరల్ ఎంట్రీలో చోటు దక్కించుకున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
జనరల్ ఎంట్రీలో చోటు..
జనరల్ ఎంట్రీలో ఎంపిక కావడంతో ఈ రెండు సినిమాలు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటి కీలక కేటగిరీల్లో పోటీపడే అవకాశాన్ని సంపాదించాయి. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడిస్తూ, "ఆస్కార్‌కు రెండు అడుగుల దూరంలో ఉన్నాం" అని పేర్కొంది.

ఆస్కార్ 2026..
98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఈ పోటీలో 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు అర్హత పొందుతాయి. తుది నామినేషన్ల జాబితాను 2026 జనవరి 22న అకాడమీ ప్రకటించనుంది.
మహావతార్ నరసింహ..
ఎలాంటి భారీ ప్రచారం లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం 'మహావతార్ నరసింహ'. దర్శకుడు అశ్విన్ కుమార్ సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ యానిమేటెడ్ మూవీ, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండటం విశేషం. నరసింహ స్వామి ప్రత్యక్షంగా వచ్చి కనిపించినట్టుగా అనిపించే సన్నివేశాలు, వాటికి తగ్గట్టుగా వచ్చే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. భారతీయ యానిమేటెడ్ సినిమాల స్థాయిని కొత్త మెట్టుకు తీసుకెళ్లిన చిత్రంగా ఇది నిలిచింది.
A sacred journey born from faith, glory, and eternal belief.
— Hombale Films (@hombalefilms) January 9, 2026
Truly honoured and elated as #MahavatarNarsimha enters Best Picture contention at the #Oscars Academy Awards 2026.#MahavatarForOscars#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/CIFlY8nxci
కాంతార: చాప్టర్-1..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంతార: చాప్టర్-1'. ఇది గతంలో సంచలన విజయం సాధించిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా రూపొందింది. జానపద సంస్కృతి, దైవ విశ్వాసాలు, మట్టి వాసనను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నంగా ఈ చిత్రం నిలిచింది.
కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'కాంతార' ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ విజయానికి కొనసాగింపుగా విడుదలైన 'కాంతార: చాప్టర్-1' కూడా అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, జయరాం, గుల్షన్ సహా పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు.
Rooted in our culture, driven by divinity.
— Hombale Films (@hombalefilms) January 9, 2026
Proud and privileged as #KantaraChapter1 enters the Best Picture contending race at the #Oscars Academy Awards 2026.#KantaraForOscars#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets… pic.twitter.com/xSCsH28Qjr
గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్న హోంబలే ఫిల్మ్స్..
'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి చిత్రాలతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు ఒకే ఏడాది రెండు సినిమాలతో ఆస్కార్ బరిలో నిలవడం మరో చరిత్రాత్మక ఘట్టంగా మారింది. ఇది కేవలం నిర్మాణ సంస్థకు మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలుస్తోంది.
-
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications