ఆ సినిమా తిరస్కరించినందుకు ఇప్పటికీ బాధపడుతున్న మహేష్ బాబు
తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకు ఎన్నో కథలు వచ్చి వెళుతుంటాయి. అప్పటికే చేస్తున్న సినిమాలతోపాటు మరికొన్ని సినిమాలను ఒప్పుకోవడం, అనివార్య కారణాలవల్ల కొన్ని సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయడం కుదరని సందర్భాలు ఎదురవుతుంటాయి. అయితే అలా వద్దన్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతోపాటు ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్ గా నిలిచినవి కూడా ఉంటాయి. ఒక కథానాయకుడిగా ఇవన్నీ సహజమని ప్రిన్స్ సరిపెట్టుకుంటారు.
అయితే ఒక కథను మాత్రం డైరెక్టర్ చెప్పినప్పటికీ చేయడం కుదరలేదు. తర్వాత వేరే హీరోతో సినిమా రావడం.. సూపర్ హిట్ కావడం జరిగిపోయాయి. ఇప్పటికీ మహేష్ బాబు మనసును మెలిపెట్టే విషయం ఏదన్నా ఉందా? అంటే ఆ సినిమాను చేయకపోవడమేనని తన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తుంటారు. ఆ సినిమా ఏదో కాదు.. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో.

సుకుమార్ తో మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా చేశారు. అది ఫ్లాపైంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నాన్నకు ప్రేమతో సినిమా కథను ప్రిన్స్ కు దర్శకుడు వినిపించారు బాగుందనిపించింది.. కానీ ఏ నిర్ణయాన్ని చెప్పలేకపోయారు. ఈలోగా వన్ విడుదలై పరాజయం పాలైంది. దీంతో సుకుమార్ ఆ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్నో సినిమాలను వద్దనుకున్నప్పటికీ తనకు ఈ సినిమా చేయలేకపోవడం మాత్రం ఎంతో బాధిస్తుందని మహేష్ బాబు తరుచుగా సన్నిహితులతో చెబుతుంటారు.












Click it and Unblock the Notifications