కన్నప్పలో సూపర్ స్టార్ రజినీకాంత్ - మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం " కన్నప్ప ". ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నారు. ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 27వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే గత కొన్నాళ్లుగా విష్ణు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో ఈసారి మాత్రంభారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మంచు హీరో. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి పలు హాట్ కామెంట్స్ చేయడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ విష్ణు ఏమన్నారంటే.. కన్నప్ప సినిమాలో రజినీకాంత్ కూడా నటించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తన తండ్రి మోహన్‌బాబు పాత్రకు కాంబినేషన్‌తో మరో క్యారెక్టర్ కూడా అనుకున్నామని స్పష్టం చేశారు. ఆ పాత్ర కోసం రజనీకాంత్ ని ఎంపిక చేద్దామనుకున్నానని తెలిపారు. కానీ కథకు సంబంధం లేకుండా ఆ ట్రాక్ ఎక్కువైపోతుందేమోనని రచయితలు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. అందుకే ఆ పాత్రను తొలగించామని వివరించారు.
అంతే కాకుండా ఈ మూవీలో ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నామో సినిమా చూశాక అర్థమవుతుందని విష్ణు అన్నారు. రెండు పాత్రలు ఆఫర్ చేసి.. ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే.. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ చేస్తానన్నారని వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ మాయం కావడం కూడా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ పరిస్థితుల్లో సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మరోవైపు మంచు ఫ్యామిలీలో విభేదాలు కారణంగా కుటుంబ పంచాయతీ రోడ్డుకెక్కింది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఇష్యూ గొడవలు, కేసులతో మొదలై.. డైరెక్ట్ గానే కామెంట్స్ చేసుకునే స్థాయికి చేరింది. రీసెంట్ గా రక్తం పంచుకొని పుట్టినవాళ్లే తన పతనాన్ని కోరుకుంటున్నారని విష్ణు ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకు కౌంటర్ గా మనోజ్ భైరవం ఈవెంట్ లో మాట్లాడుతూ.. కట్టు బట్టలతో రోడ్డు మీదకు వచ్చానన్నారు. కట్టె కాలేవరకు తాను మోహన్ బాబు కొడుకునేనని అన్నారు. అంతే కాకుండా శివయ్య అంటే శివయ్య రాడని, ఇలాంటి అభిమానులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలోనే శివయ్య వస్తాడని సెటైర్లు వేశారు. ఆ తర్వాత అలా అన్నందుకు క్షమాపణలు కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications